కుక్కపిల్లలని పెంచితే....ఎలుగుబంట్లయి కూర్చున్నాయి.!! ఓ జంతు ప్రేమికుడు చిన్ని కుక్క పిల్లల్ని తెచ్చుకుని పెంచుకున్నాడు. వాటిని అల్లారుము...
కుక్కపిల్లలని పెంచితే....ఎలుగుబంట్లయి కూర్చున్నాయి.!! ఓ జంతు ప్రేమికుడు చిన్ని కుక్క పిల్లల్ని తెచ్చుకుని పెంచుకున్నాడు. వాటిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. పాలు పోసి పెంచాడు.. వాటి కోసం చిన్న ఇల్లు కట్టించాడు. ఆహారం, నీళ్ళు అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రెండేళ్ళ తరువాత అవి కుక్కపిల్లలు కాదు. ఎలుగుబంట్లని తెలియడంతో ఆశ్చర్యపోయాడు. చైనాలోని వాంగ్ కియూకి జంతువులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ కుక్కలంటే మరీ ప్రాణం. రెండు కుక్క పిల్లల్ని పెంచుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఈ రెండు పప్పీల్లో ఏదో తేడా ఉన్నట్టు అర్థమైంది. దాదాపు 100 పౌండ్ల దాకా బరువు పెరిగాయి. కుక్కలు ఈ స్థాయిలో బరువు పెరగవు. దీనికితోడు తాను పెంచుతున్న కోళ్లు అనూహ్యంగా మాయమవడాన్ని గమనించాడు. ఈ లోగా స్థానిక అధికారులు ముద్రించిన కరపత్రాన్ని ఒకదాన్ని చదివాడు. ఇవి టైప్ 2 ఎలుగుబంట్లనీ.,. పక్కనున్న జంతువులను చంపి తింటూ ఉంటాయని దాని సారాంశం. అప్పటికిగానీ అర్థం కాలేదు తన పెరట్లో కోళ్ళు ఎలా మాయయవుతున్నాయో. తాను గత రెండేళ్లుగా పెంచుతోంది కుక్కపిల్లల్ని కాదనీ ఏషియన్ ఎలుగుబంట్లనని తెలుసుకుని ఆశ్యర్యపోయాడు. ఇవి చాలా అరుదైన జాతికి చెందినవని తెలుసుకుని వెంటనే వాటిని స్థానిక జంతు సంరక్షణ అధికారులకు అప్పగించాడు. ఇవి ఒకటి ఆడ, మరొకటి మగ ఎలుగులనీ రెండూ ఆరోగ్యంగా ఉన్నాయని జూ అధికారులు చెప్పారు. వాటిని జూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.