రెడ్ నిక్కర్ పై చేతితో స్మాకింగ్ చేసిన వైట్ షర్ట్ వేసుకున్న జార్జ్ చిన్నారి రాకుమారి షార్లెట్ నామకరణమహోత్సవంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలి...
రెడ్ నిక్కర్ పై చేతితో స్మాకింగ్ చేసిన వైట్ షర్ట్ వేసుకున్న జార్జ్ చిన్నారి రాకుమారి షార్లెట్ నామకరణమహోత్సవంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ప్రిన్స్ జార్జ్ వేసుకున్న డ్రెస్ ఆన్ లైన్ లో 85 పౌండ్లకు అమ్ముడు పోయింది. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియం,కేట్ దంపతులు ముద్దుల కూతురు షార్లెట్ పేరు పెట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు పేరెంట్స్ తో కలిసి జార్జ్ అటెండ్ అయ్యాడు. రెడ్ నిక్కర్ పై చేతితో స్మాకింగ్ చేసిన వైట్ షర్ట్ వేసుకున్న జార్జ్. ఆ డ్రెస్ లో ఎంతో ముద్దుగా కన్పించాడు. ఈ డ్రెస్ ను ఆన్ లైన్ లో పెట్టగా కొద్ది టైంలోనే 85 పౌండ్లకు సేల్ అయ్యింది. జార్జ్ డ్రెస్ లు ఇప్పుడు బ్రిటన్ లో చిన్నారులకు పేద్ద ఫ్యాషన్ అవుతున్నాయి. బ్రిటన్ రాజకుటుంబంలో జార్జ్ మరో ఫ్యాషన్ ఐకాన్ అయ్యాడు.