హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రేపు తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రేపు ...
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రేపు తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రేపు యాదగిరిగుట్టలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. యాదాద్రి ఇవాళ రాత్రి 9 గంటల నుంచి కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లనుంది. రాష్ట్రపతి ప్రణబ్ లక్ష్మీనరసింహుడిని దర్శించుకోనున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు అనుమతి నిరాకరించారు. పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.