హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాల్లో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. ఎంసెట్ ...
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాల్లో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. ఎంసెట్ కౌన్సెలింగ్కు ఏపీలో సెంటర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఏపీ విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతోంది. ఈనెల 18 నుంచి 23 వరకు విద్యార్థులు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియకు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అన్నీ ఏర్పాట్లు చేశారు. మొదటి ర్యాంకు నుంచి 15 వేల ర్యాంకు వరకు ఈ కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించిన 90 వేల మంది విద్యార్థులు ఈ కౌన్సిలింగ్లో పాల్గొంటారు. ఈనెల 23వ తేదీన 75 వేల ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. మరోవైపు రాష్ట్రంలో చాలా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొన్నటి వరకు జరిగిన తనిఖీల్లో ఏ కాలేజీకి అనుమతి ఉందో, ఏ కాలేజీకి అనుమతి ఊడుతుందో అనే భయాందోళనలోనే కాలేజీలున్నాయి.