- 'పాలమూరు ఎత్తిపోతల' ఆపాలని.. కేంద్రానికి బాబు లేఖ - నిరసిస్తూ పాలమూరు బంద్‌కు టీఆర్ఎస్ పిలుపు - ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో...
- 'పాలమూరు ఎత్తిపోతల' ఆపాలని.. కేంద్రానికి బాబు లేఖ -
నిరసిస్తూ పాలమూరు బంద్‌కు టీఆర్ఎస్ పిలుపు
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు పలు రాజకీయపక్షాల మద్దతు మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలమండలికి లేఖ రాయడాన్ని ఖండిస్తూ టీఆర్ఎస్ శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏపీ ప్రభుత్వం కుట్రలను ఎండగట్టాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆగస్టు 8న 2013 అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జీఓనం.72 విడుదల చేశారని గుర్తుచేస్తున్నారు. నేటి జిల్లా బంద్‌కు టీజేఏసీ, టీజీఓ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, పీఆర్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం, టీఆర్ఎస్వీ, టీ పీఆర్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, టీఎస్టీయూ, డీటీఎఫ్, టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘాలు, సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉద్యోగుల విధుల బహిష్కరణ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జిల్లా బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కన్వీనర్లు రామకృష్ణగౌడ్, గుండు శ్రీనివాస్‌గౌడ్, ప్రచార కార్యదర్శి బాల్కిషన్ తెలిపారు. ఉద్యోగులు విధులను బహిష్కరిస్తారని తెలిపారు. ఇందులో భాగంగానే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రయత్నాలను తిప్పికొడతామని హెచ్చరించారు. బంద్‌లో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చంద్రబాబు వైఖరిని జేఏసీగా ఎండగడుతామని, ప్రజలు ఈ కుట్రలను గుర్తించాలని కోరారు. ఇంతద్రోహం చేస్తున్నా టీడీపీ జిల్లా నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ్మ, సీపీఎం జిల్లా కాార్యదర్శి ఎండీ జబ్బార్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతిభూషన్ వేర్వేరు ప్రకటనల్లో బంద్‌కు సంపూర్ణమద్దతు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక మద్దతు పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను అడ్డుకుంటున్నందుకు నిరసనగా టీఆర్ఎస్ శుక్రవారం చేపడుతున్న జిల్లా బంద్‌కు పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రయోజనాలకు విరుద్ధంగా చంద్రబాబు లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.