ఏసీసీ, : లోక కల్యాణార్థం చేపట్టిన బ్రహ్మయజ్ఞ కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగింది. వికాస తరంగిణి, గోదావరి పుష్కర ప్రయుక్త బ్రహ్మ...
ఏసీసీ, : లోక కల్యాణార్థం చేపట్టిన బ్రహ్మయజ్ఞ కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగింది. వికాస తరంగిణి, గోదావరి పుష్కర ప్రయుక్త బ్రహ్మయజ్ఞ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మయజ్ఞాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యేక్ష పర్యవేక్షణలో అట్టహాసంగా కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సేవాకాలం, తీర్థగోష్టి, శాంతిసుందర పారాయణం, గోపూజలు, సామూహిక వెంకటేశ్వర అష్టోత్తర పూజలు చేశారు. మధ్యాహ్నం నిత్య పూర్ణాహుతి, తదియారిన, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి పుష్కర ప్రయుక్త బ్రహ్మయజ్ఞంలో భాగంగా శనివారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామీజీల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పుర వీధులన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. మహిళలు కోలాటాలు.. ఆదివాసీలు గుస్సాడి నృత్యాలు అలరించాయి. అనంతరం గోదావరితల్లికి హారతి ఇచ్చి నాల్గో రోజు పుష్కర ముగింపు కార్యక్రమం చేపట్టారు.