-రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభమైంది. తొలి విడత 25వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు వేగం అందుకుంది. దీనిలో భాగంగా పలు శాఖల్లో ఖాళీగా ఉన్న వాటిలో ప్రాధాన్య క్రమంలో మొదట విడత పోలీస్, పంచాయతీరాజ్‌శాఖ, విద్యుత్‌శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు:
-తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ అయ్యేవి:
-అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్‌లో..
-అగ్రికల్చర్ ఆఫీసర్ - 120 పోస్టులు
-అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 - 311
-హార్టికల్చర్ ఆఫీసర్ - 75
ఐ అండ్ సీఏడీ డిపార్ట్మెంట్లో...
0అసిస్టెంట్ ఇంజినీర్ - 252
0అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 159 ఖాళీలు
మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో...
-గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ - 19
-హెల్త్ అసిస్టెంట్స్ ఇన్ మున్సిపాలిటీస్ - 50
-సానిటరీ ఇన్స్పెక్టర్ - 35
-అసిస్టెంట్ ఇంజినీర్ (పబ్లిక్ హెల్త్)- 389
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 126
-క్యాడ్ ఆపరేటర్ - 59
-టెక్నికల్ ఆఫీసర్ - 54
-బిల్ కలెక్టర్ (జీహెచ్ఎంసీ) - 124
-అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ - 115
-డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ - 2
స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు...
డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో...
-సబ్ ఇన్స్పెక్టర్ - 12
-కానిస్టేబుల్ -174
డీజీ అండ్ ఐజీ ఆఫ్ పోలీస్‌లో...
-ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ - 2,760
-పోలీస్ కానిస్టేబుల్ - 56
-(స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ సెంట్రల్ పోలీస్ లైన్స్)
-పోలీస్ కానిస్టేబుల్ - 1,810
-పోలీస్ కానిస్టేబుల్ - 349
-(టీఎస్ఎస్పీ 15 బెటాలియన్)
-పోలీస్ కానిస్టేబుల్ - 2,860
(టీఎస్ఎస్పీలో, 15 బెటాలియన్ తప్ప మిగిలినవాటిలో)
-సబ్ఇన్స్పెక్టర్ (సివిల్) - 107
-సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్) - 91
-టీఎస్ఎస్పీ ఆర్ఎస్ఐ - 288
-సబ్ ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్స్) - 35
-సబ్ ఇన్స్పెక్టర్ (పీటీవో) - 6
డీజీ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్
ఫైర్ సర్వీసెస్‌లో........
-ఫైర్‌మ్యాన్ - 6
-డ్రైవర్ ఆపరేటర్ - 85
-స్టేషన్ ఫైర్ ఆపరేటర్ - 9
-మొత్తం ఖాళీల సంఖ్య - 9,058
అన్ని శాఖల్లో మొత్తం ఖాళీల సంఖ్య - 15,522
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మార్కుల వారీగా ప్రిపరేషన్
-మొదటి దఫాగా ప్రకటించిన 15,522 ఉద్యోగాల్లో అగ్రభాగం పోలీస్ శాఖ దక్కించుకుంది. అందులో ఎక్కువగా ఉన్నవి కానిస్టేబుల్ పోస్టులు. ఎస్ఐ ఉద్యోగాలు తక్కువగా ఉండటంతో పోటీ తీవ్రస్థాయిలో ఉండనుంది. కొలువుల ప్రకటన నేపథ్యంలో కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల శిక్షణ కోసం 40 కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా కొంత మంది అభ్యర్థులు రెండు సంవత్సరాల నుంచి కఠోర తపస్సు చేస్తున్నారు.
తెలంగాణ కేంద్రంగా 50 మార్కులకు పైనే..
-అంతేగాకుండా అభ్యర్థులు జీఎస్ అనే అంశంలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి.. అన్న అంశంపై ఒక క్లారిటీ ఉండాలి. లేదంటే అన్ని అంశాలు కలగూరగంపగా చదివి నష్టపోయే అవకాశం ఉంది. అలాగే అర్థమెటిక్ &రీజనింగ్ విభాగంలో ఎస్ఐలో 200 మార్కులు కేటాయిస్తే ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో అవగాహన అవసరం. అర్థమెటిక్ నుంచి 80 నుంచి 90 మార్కులు, ప్యూర్ మ్యాథ్స్ నుంచి 20 నుంచి 30, రీజనింగ్ 80 మార్కులు, మొత్తంగా 200 మార్కులు. దీనిలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎక్కువ నమూనా పేపర్స్‌ను ప్రాక్టీస్ చేయడమే ఉత్తమ మార్గం. ఎన్ని ఎక్కువ మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే అంత ఫలితం ఉంటుంది. కనీసం ప్రతి అభ్యర్థి 50 మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. గతంలో జరిగిన పాత ప్రశ్న పత్రాలు తిరిగేస్తే 25 శాతం మార్కులు సులభంగా సాధించవచ్చు.
-కానిస్టేబుల్: కానిస్టేబుల్ పరీక్షలకు కూడా పూర్తిగాఎస్ఐ సిలబస్సే ఉంటున్నప్పటికీ ప్రశ్నలు అడిగే స్థాయి మాత్రం తక్కువగా ఉంటు ంది. కానిస్టేబుల్ పరీక్షలో పూర్తిగా ప్రశ్నలన్నీ బేసిక్ స్థాయిలోనే ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పుస్తకాలు పూర్తిగా చదివితే సరిపోతుంది. దీనిలో కూడా తెలంగాణ అంశం నుంచి 30 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 200 మార్కులకు పేపర్ ఉండగా 100 మార్కులు జీఎస్, 20 నుంచి 25 మార్కులు జనరల్ ఇంగ్లీష్, ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి 80 మార్కులకు వస్తున్నాయి. ఈ అర్థమెటింగ్ రీజనింగ్‌లో.. రీజనింగ్ నుంచి 25 నుంచి 30 మార్కులు, ప్యూర్ మ్యాథ్స్ నుంచి 30 నుంచి 40 మార్కులకు అడుగుతున్నారు. గతంలో నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో సబ్జెక్టుల వారీగా మార్కులను పరిశీలిస్తే...
మరో పదివేలకు పైగా కొలువులు
-రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 2న ప్రకటించిన విధంగా 25వేల పోస్టుల భర్తీలో భాగంగా ఇప్పటికే 15,522 పోస్టులకు అన్ని అనుమతులు లభించాయి. ఇక మిగిలిన పదివేల పోస్టులకు అతి త్వరలో నియామక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫైలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఖాళీలల్లో వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఉన్నతవిద్య, సమాచార పౌరసంబంధాల శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
-ముఖ్యంగా మొదటి విడత ప్రకటించిన వాటిలో ఎక్కువగా ఇంజినీరింగ్ తదితర టెక్నికల్ ఉద్యోగాలు ఉండగా రెండో విడత విడుదల చేయబోయే నోటిఫికేషన్లో సుమారు 2వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఉండవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా ఆరోగ్యశాఖ నుంచి 6,400 పోస్టులకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. వీటిలో డాక్టర్లు, పారామెడికల్, సాంకేతిక, సహాయక సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే జాతీయ ఆరోగ్యమిషన్‌లో భాగంగా 1,330 ఒప్పంద పద్ధతిలో నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అదేవిధంగా పశు వైద్యులు, పారా వెటర్నరీ - 2,000 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.
-వీటికితోడు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ విషయం ఫైనల్ అయితే జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాల సమాచారం.
-అదేవిధంగా పాఠశాల విద్యకు సంబంధించి బదిలీలు, రేషనలైజేషన్ పూర్తికావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు గత డీఎస్సీ అభ్యర్థులకు కొన్ని పోస్టులు ఇచ్చి, మిగిలిన వాటికి డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
-రానున్న ఏడాది కాలంలో గ్రూప్స్, పోలీస్, ఆరోగ్యశాఖ, విద్య తదితర శాఖల్లో భారీగా నియామకాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అభ్యర్థులు ఇప్పటినుంచే కొత్త సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే ప్రభుత్వ కొలువు సొంతం అవుతుంది.
రెవెన్యూ డిపార్ట్మెంట్లో.....
-ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ - 340
-ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ -220
-అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ - 105
-గ్రేడ్ -2 సబ్ రిజిస్ట్రార్ - 23
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో....
-గ్రేడ్ -3 డ్రాఫ్ట్స్‌మెన్ - 58
-అసిస్టెంట్ ఇంజినీర్ - 42
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 83
-ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ - 141
-అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ - 45
-మొత్తం ఖాళీల సంఖ్య - 3,783
పంచాయతీరాజ్ అండ్ రూరల్
డెవలప్మెంట్లో....
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 161
-అసిస్టెంట్ ఇంజినీర్ - 243
-మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ - 23
-ఈవో పీఆర్ అండ్ ఆర్డీ - 67
హైదారబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్
బోర్డులో...
-మేనేజర్ ఇంజినీరింగ్ - 146
-గ్రేడ్ -2 టెక్నీషియన్ - 10
-గ్రేడ్ -2 టెక్నీషియన్ - 19
-గ్రేడ్ -2 టెక్నీషియన్ -15
-టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ - 123
ఎనర్జీ శాఖలో (విద్యుత్)
టీఎస్‌జెన్‌కోలో....
-అసిస్టెంట్ ఇంజినీర్ -988
-సబ్ ఇంజినీర్ - 92
టీఎస్ఎన్పీడీసీఎల్లో....
-అసిస్టెంట్ ఇంజినీర్ - 309
-సబ్ ఇంజినీర్- 314
టీఎస్ఎస్పీడీసీఎల్లో...
-అసిస్టెంట్ ఇంజినీర్ - 427
-సబ్ ఇంజినీర్ - 153
టీఎస్‌ట్రాన్స్‌కోలో....
-అసిస్టెంట్ ఇంజినీర్ - 224
-సబ్ ఇంజినీర్ - 174