కన్నడ విలక్షణ హీరో ఉపేంద్రకు తెలుగులో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఎ, ఉపేంద్ర, రా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారాయన. కొన్...
కన్నడ విలక్షణ హీరో ఉపేంద్రకు తెలుగులో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఎ, ఉపేంద్ర, రా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారాయన. కొన్నేళ్ల క్రితం ఆయన నటించిన ఉపేంద్ర తెలుగు, కన్నడ భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్గా కన్నడంలో ఉప్పి-2 పేరుతో ఓ చిత్రాన్ని ఉపేంద్ర నటిస్తూ రూపొందిస్తున్నారు. పారుల్ యాదవ్, క్రిష్టినా అకీవా నాయికలుగా నటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను ఉపేంద్ర-2 పేరుతో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలుగులో అందిస్తున్నారు. ఈ నెలలోనే కన్నడంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నల్లమలుపు శ్రీనివాస్ మాట్లాడుతూ నా సినీ కెరీర్ ఉపేంద్ర నటించిన రా సినిమాతో మొదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు ఆయనతో సినిమా తీసే అవకాశం లభించింది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగులో త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భవ్య, కెమెరా: అశోక్ కశ్యప్, సంగీతం: గురుకిరణ్.