ప్రతి ఇంటికి రెండు కిలోలు రేపటి నుంచి రైతుబజార్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లు ఉల్లి కోసం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అధి...
రేపటి నుంచి రైతుబజార్లు,
రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లు
ఉల్లి కోసం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
అధికారులను ఆదేశించిన
మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/రంగారెడ్డి: ప్రతి కుటుంబానికి 2 కిలోల చోప్పున కిలోకు 20 రూపాయలకు సబ్సిడిపై ఉల్లిగడ్డలను అందించేందుకు ఆగస్టు 5 నుంచి అన్ని రైతు బజార్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఎర్పాటు చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశిం చారు. సోమవారం నాడు సచివాలయం నుంచి ఉల్లిగడ్డల సరఫరా, ఇసుక రవాణ, నీటి ప్రాజెక్టులకు భూ సేకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉల్లిగడ్డ కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మార్కెట్లో ఉల్లిగడ్డ లభ్యం అవుతున్న ప్రాంతాలలో కోనుగోలు చెసి సబ్సిడిపై ఇవ్వడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్ర మ రవాణా అరికట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మేంట్ కమీటి సమావేశం ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచాలని, అకస్మీక తనికీలు నిర్వహించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణవ కోసం భూ సేకరణ ప్రక్రియను పూర్తి చెయడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆమ్రాపాలి మాట్లాడుతూ 5 రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 రైతు బజార్లలో , చెవెళ్ళ మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డ విక్రయ కేంద్రాలను ఈ నెల 5 నుంచి ఎర్పాటు చెస్తామన్నారు. జిల్లాలోని శంకర్పల్లి ప్రాంతంలో ఉల్లిగడ్డలను రైతులను కోనుగోలు చెయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తాండూర్, వికారాబాద్చ ఇబ్రహింపట్నం ప్రాంతాలోకల చిన్న నీటి ప్రాజెక్టులకు సంబందించి భూ సేకరణ పెండింగ్‌లో ఉందని తగు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మార్కెటింట్ ఎడి చాయాదేవి, గనుల శాఖ ఎడి జయరాజ్, ఫౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.