-కన్వీనర్ కోటాలో 56,017 ఇంజినీరింగ్ సీట్లు మాత్రమే భర్తీ హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్ర...
-కన్వీనర్ కోటాలో 56,017 ఇంజినీరింగ్ సీట్లు మాత్రమే భర్తీ
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది అన్ని కాలేజీల్లో కలిసి కన్వీనర్ కోటాలో 30,788 సీట్లు మిగిలాయి. ఇందులో బీటెక్ కాలేజీల్లో 26,695, బీఫార్మసీ కాలేజీల్లో 4,093 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తుది విడత కౌన్సెలింగ్లో భాగంగా శనివారం ఉదయం సీట్లు కేటాయించారు. ఈ అలాట్మెంట్లో 64.53% సీట్లు మాత్రమే నిండాయి. ప్రభుత్వ కాలేజీల్లో 99.70%, ప్రైవేటు కాలేజీల్లో 66.43% సీట్లు భర్తీ అయ్యాయి. తుది విడత కౌన్సెలింగ్నాటికి 44,387 సీట్లు అందుబాటులో ఉండగా, సీట్ అలాట్మెంట్ తర్వాత ైస్లెడింగ్వారు 16,170 ఉన్నట్లు ఎంసెట్ క్యాంపు అధికారులు తెలిపారు. ఇందులో 7,675 మంది తుది విడతలో కొత్తగా సీట్లు పొందారు. ఈ ఏడాది 98,691 మంది విద్యార్థులు ఎంసెట్లో ర్యాంకులు సాధించగా, 67,653 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో తుది విడతలో 41,327 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. కన్వీనర్ కోటాలో మొత్తం 86,805 సీట్లు అందుబాటులో ఉండగా, రెండు విడతల కౌన్సెలింగ్లో కలిపి 56,017సీట్లు భర్తీ అయ్యాయని ఎంసెట్ క్యాంపు అధికారి బీ శ్రీనివాస్ చెప్పారు. 91 కాలేజీల్లో 100% అడ్మిషన్లు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, బీఫార్మసీ కాలేజీలు మొత్తం 383 ఉండగా, 91 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి. 7 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. సీట్లు పొందినవారు ఆయా కాలేజీల్లో ఈ నెల 4నాటికి రిపోర్ట్ చేయాలి. ఫీజులు చెల్లించడానికి సోమవారం వరకు గడువుంది. సాంకేతిక విద్యాభవన్లో చలాన్ కట్టడానికి ఈ నెల 7 చివరి తేదీగా నిర్ణయించారు. శనివారం నుంచి అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తారు.