దక్షిణ భారత దేశానికే తలమానికంగా తెలంగాణ కొంగు బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో కొత్తగా 17 బొగ్గు గనులు ప్రారంభించనుందని, దీన...
దక్షిణ భారత దేశానికే తలమానికంగా తెలంగాణ కొంగు బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో కొత్తగా 17 బొగ్గు గనులు ప్రారంభించనుందని, దీని వల్ల మరిన్ని ఉద్యోగావకాశాలు రానున్నాయని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం సింగరేణి వ్యాప్తంగా నాలుగు జిల్లాల స్థాయిలో కొత్తగూడెంలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎస్ అండ్ పీసీ, ఎన్సీసీ, బ్యాండ్ పార్టీల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉత్తమ కార్మికులకు ప్రశంసా పత్రాలు, బహుమతులతో శాలువా లు కప్పి సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ... దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు. వారు కన్న కలలను నిజం చేయడమే మనం సమర్పించే నిజమైన నివాళి అన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు దేశంలోనే మన రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా నిలపాలని కృషి చేస్తున్నారని, ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు.
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కంపెనీలు మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొస్తున్నాయని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఈ క్రమంలో విద్యుత్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని, విద్యుత్ లేకపోతే అభివృద్ధి లేదు, కాబట్టి మన సీఎం విద్యుదుత్పత్తి పెంపుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. ఇందులో సింగరేణి కూడా భాగస్వామి అయిందని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కర్మాగారంతో పాటు రానున్న రోజుల్లో ఆరువేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్ కర్మాగారాలను స్థాపించనుందని వెల్లడించారు. సింగరేణి సంస్థ నుంచి రాష్ర్టావసరాలకు తగినంత బొగ్గు అందించాలని, కొత్త గనులు, ప్రాజెక్టులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. రానున్న ఐదేళ్లలో 17 కొత్త బొగ్గుగనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా మణుగూరు కొండాపూర్ భూగర్భగని, బెల్లంపల్లి ఓసీపీ-2 విస్తరణ, రామగుండం ఓసీపీ-2 విస్తరణ గనులు ప్రారంభించనున్నామన్నారు.
అన్నీ సవ్యంగా సాగితే 2020 నాటికి సింగరేణి దేశంలోనే.. పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఎదుగుతుందన్నారు. ఇందుకోసం కార్మికులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాకును కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని, ఇది ఎంతో సంతోషదాయకమని, అక్కడ కూడా త్వరలోనే బొగ్గు తవ్వకాలు జరపడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
జనవరిలో 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి...
సింగరేణి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 2016 జనవరి నాటికి 600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. రెండో యూనిట్లో మార్చి నెలలో ఉత్పత్తి అందిస్తామన్నారు. అదే ప్రాంగణంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మరో 600 మెగావాట్ల పవర్‌ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, ఈ ప్లాంట్‌ను కూడా త్వరిత గతిన పూర్తి చేసి ఉత్పత్తి జరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సుమారు ఐదువేల ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన తొలి ప్రభుత్వ సంస్థగా సింగరేణి ఘనత కెక్కిందన్నారు. పైరవీలకు తావు లేకుండా ఇంటర్యూల ప్రక్రియను తొలగించి, రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా కొద్ది గంటల్లోనే ఫలితాలను వెల్లడించి నిజమైన, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో 17 కొత్తగనుల ద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు.
2011 జనవరి నుంచి 2014 మార్చి వరకు నమోదైన 2164 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కార్మికులకు వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కొత్తగూడెం, రామగుండం ఏరియాల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశామని, ప్రతీ ఏరియాలో అత్యాధునిక ఇన్సెంటీవ్ కేర్ యూనిట్ సదుపాయాలతో కూడిన అంబులెన్సును కూడా సమకూర్చడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ర్టానికి వచ్చే ఏడాది సింగరేణి నర్సరీల నుంచి కోటి మొక్కలను అందించనున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందరూ విబేధాలు మరిచి పనిచేయాలని ప్రతిజ్ఞ పూనాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు పవిత్రన్‌కుమార్, రమేష్‌కుమార్, మనోహర్‌రావు, రమేష్‌బాబు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, జీఎం పర్సనల్ ఆనందరావు, జీఎంలు మల్లయ్య పంతులు, బసవయ్య, రామబద్రిరాజు, కిషన్‌రావు, అమర్నాధ్, విజయరావు, శర్మ, శరత్‌కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.