హైదరాబాద్ (జూలై 31): నగరంలో గుడుంబా ఏరులై పారుతోంది. గుడుంబా అంటే కేరాప్ అడ్రస్‌గా ఉన్న ధూల్‌పేటను మరిపించేలా జిల్లా నుంచి నాటుసారా నగర...
హైదరాబాద్ (జూలై 31): నగరంలో గుడుంబా ఏరులై పారుతోంది. గుడుంబా అంటే కేరాప్ అడ్రస్‌గా ఉన్న ధూల్‌పేటను మరిపించేలా జిల్లా నుంచి నాటుసారా నగరానికి యదేచ్చగా రవాణా అవుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ఇప్పుడు నాటుసారానే పూటుగా లాగించేస్తున్నారు. గుడుంబాను అడ్డుకునేందుకు ధూల్‌పేట మీదే ఎక్సైజ్ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. కానీ జిల్లాల నుంచి వచ్చే నాటుసారాను పట్టించుకోవడం లేదు. ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, సంతోష్‌నగర్, కాటేదాన్, రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాలకు రంగారెడ్డి, మహాబూబ్‌నగర్ జిల్లాల్లోని మైసిగండి, కడ్ల్తాల్, ఆమనగల్ వంటి ప్రాంతాల నుంచి నాటుసారా అక్రమంగా నగరానికి వచ్చి చేరుతోంది. శివారు ప్రాంతాల్లో బస్తీలు, గుడిసె ప్రాంతాలు ఇప్పుడు గుడుంబా విక్రయాలకు అడ్డాలుగా మారాయి. 'ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడు' అన్న సామెతను నిజం చేసేలా ఎక్సైజ్ శాఖలోని కొందరు ఉద్యోగులే నగరంలో గుడుంబా విక్రయాలు పెరగడానికి కారణమవుతున్నారు. అధికారులకు గుడుంబా స్థావరాలు తెలిసినా అక్కడ దాడులు నిర్వహించే సమాచారం ముందుగానే తెలిసిపోతోంది. దీంతో దాడులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. కేవలం అప్పుడప్పుడు మొక్కుబడిగా కేసులు రాస్తున్నారు. అంతకుమించి గుడుంబాల అమ్మకాలను, ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఎక్సైజ్ శాఖలో చాలీచాలనీ సిబ్బందికి తోడు క్షేత్ర స్థాయిలో నిత్యం దాడులు నిర్వహించి గుడుంబా అమ్మకాలను అడ్డుకునే పరిస్థితి లేదు. ఇది గుడుంబా వ్యాపారులకు మంచి అవకాశంగా మారింది. పాతబస్తీతో శివారు ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలతో మద్యం షాపుల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ కారణంగానే హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో 212 మద్యం షాపులకు గాను 150 షాపులకు మాత్రమే వ్యాపారులు టెండర్లు వేశారు. మిగతా 62 షాపులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. మలక్‌పేట పరిధిలోనే వందల్లో స్థావరాలు.. . మహాబూబ్‌నగర్ జిల్లాల్లోని కడ్తాల్, మైసిగండి,ఆమనగల్ ప్రాంతాల నుంచి మలక్‌పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు గుడుంబా పెద్ద మొత్తంలో వస్తోంది. ఈ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ చేపల మార్కెట్, ఖాజాబాగ్, సింగరేణి కాలనీగుడిసెలు, నీలం రాజశేఖర్‌రెడ్డి,డీఎస్‌నగర్ అడ్డాలు ఉన్నాయి. ఇక్కడి అడ్డాల్లో ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు సిబ్బంది సహకారంతోనే బహిరంగంగా గుడంబా అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికుల ఫిర్యాదులతో మొక్కుబడిగా గుడంబా అమ్మకం కేంద్రాలపై ఎక్సైజ్ విభాగం అధికారుల దాడులు చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు సిబ్బంది దాడుల సమాచారాన్ని ముందుగానే గుడుంబా వ్యాపారులకు చేరవేస్తున్నారు. దీంతో దాడులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. కొన్ని సందర్భాల్లో కేసులు చేయాలన్న టార్గెట్ నేపథ్యంలో అసలైన సూత్రధారులను కాకుండా వారి అనుచరులను పట్టుకొని కేసులు రాస్తున్నారు. ఇలా ఎక్సైజ్ శాఖనుంచే గుడుంబా అమ్మకాలు తగినంత ప్రోత్సాహం ఉండడంతో ధూల్‌పేట నుంచే కాకుండా నగర శివారు ప్రాంతాల నుంచి గుడుంబా యదేచ్చగా వస్తోంది. గుడుంబా వ్యాపారులకు సహకరిస్తున్న వారికి నెల నెలా మామూళ్లు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా నగర శివారు ప్రాంతాలకు ధూల్‌పేట నుంచే కాకుండా జిల్లాల నుంచి అధికంగా గుడుంబా సరఫరా అవుతున్నట్లు సమాచారం. మద్యం అమ్మకాలపైనే ఉన్నతాధికారుల దృష్టి ఎక్సైజ్ శాఖకు ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే మద్యం అమ్మకాలపైనే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల ద్వారా అమ్మకాలు పెంచాలని వత్తిడి చేస్తున్నారు. కానీ అక్రమంగా సాగుతున్న గుడుంబా అమ్మకాలను ఏమాత్రం అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టార్గెట్లు పెట్టి మద్యం విక్రయించా చేస్తున్నారే తప్ప, ఎక్సైజ్ శాఖ అధికారులు గుడుంబా తయారీని, అమ్మకాలను రూపుమాపేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు హైదరాబాద్ (జూలై 31): నగరంలో గుడుంబా ఏరులై పారుతోంది. గుడుంబా అంటే కేరాప్ అడ్రస్‌గా ఉన్న ధూల్‌పేటను మరిపించేలా జిల్లా నుంచి నాటుసారా నగరానికి యదేచ్చగా రవాణా అవుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ఇప్పుడు నాటుసారానే పూటుగా లాగించేస్తున్నారు. గుడుంబాను అడ్డుకునేందుకు ధూల్‌పేట మీదే ఎక్సైజ్ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. కానీ జిల్లాల నుంచి వచ్చే నాటుసారాను పట్టించుకోవడం లేదు. ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, సంతోష్‌నగర్, కాటేదాన్, రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాలకు రంగారెడ్డి, మహాబూబ్‌నగర్ జిల్లాల్లోని మైసిగండి, కడ్ల్తాల్, ఆమనగల్ వంటి ప్రాంతాల నుంచి నాటుసారా అక్రమంగా నగరానికి వచ్చి చేరుతోంది. శివారు ప్రాంతాల్లో బస్తీలు, గుడిసె ప్రాంతాలు ఇప్పుడు గుడుంబా విక్రయాలకు అడ్డాలుగా మారాయి. 'ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేడు' అన్న సామెతను నిజం చేసేలా ఎక్సైజ్ శాఖలోని కొందరు ఉద్యోగులే నగరంలో గుడుంబా విక్రయాలు పెరగడానికి కారణమవుతున్నారు. అధికారులకు గుడుంబా స్థావరాలు తెలిసినా అక్కడ దాడులు నిర్వహించే సమాచారం ముందుగానే తెలిసిపోతోంది. దీంతో దాడులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. కేవలం అప్పుడప్పుడు మొక్కుబడిగా కేసులు రాస్తున్నారు. అంతకుమించి గుడుంబాల అమ్మకాలను, ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఎక్సైజ్ శాఖలో చాలీచాలనీ సిబ్బందికి తోడు క్షేత్ర స్థాయిలో నిత్యం దాడులు నిర్వహించి గుడుంబా అమ్మకాలను అడ్డుకునే పరిస్థితి లేదు. ఇది గుడుంబా వ్యాపారులకు మంచి అవకాశంగా మారింది. పాతబస్తీతో శివారు ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలతో మద్యం షాపుల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ కారణంగానే హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో 212 మద్యం షాపులకు గాను 150 షాపులకు మాత్రమే వ్యాపారులు టెండర్లు వేశారు. మిగతా 62 షాపులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. మలక్‌పేట పరిధిలోనే వందల్లో స్థావరాలు.. . మహాబూబ్‌నగర్ జిల్లాల్లోని కడ్తాల్, మైసిగండి,ఆమనగల్ ప్రాంతాల నుంచి మలక్‌పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు గుడుంబా పెద్ద మొత్తంలో వస్తోంది. ఈ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ చేపల మార్కెట్, ఖాజాబాగ్, సింగరేణి కాలనీగుడిసెలు, నీలం రాజశేఖర్‌రెడ్డి,డీఎస్‌నగర్ అడ్డాలు ఉన్నాయి. ఇక్కడి అడ్డాల్లో ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు సిబ్బంది సహకారంతోనే బహిరంగంగా గుడంబా అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికుల ఫిర్యాదులతో మొక్కుబడిగా గుడంబా అమ్మకం కేంద్రాలపై ఎక్సైజ్ విభాగం అధికారుల దాడులు చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు సిబ్బంది దాడుల సమాచారాన్ని ముందుగానే గుడుంబా వ్యాపారులకు చేరవేస్తున్నారు. దీంతో దాడులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. కొన్ని సందర్భాల్లో కేసులు చేయాలన్న టార్గెట్ నేపథ్యంలో అసలైన సూత్రధారులను కాకుండా వారి అనుచరులను పట్టుకొని కేసులు రాస్తున్నారు. ఇలా ఎక్సైజ్ శాఖనుంచే గుడుంబా అమ్మకాలు తగినంత ప్రోత్సాహం ఉండడంతో ధూల్‌పేట నుంచే కాకుండా నగర శివారు ప్రాంతాల నుంచి గుడుంబా యదేచ్చగా వస్తోంది. గుడుంబా వ్యాపారులకు సహకరిస్తున్న వారికి నెల నెలా మామూళ్లు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా నగర శివారు ప్రాంతాలకు ధూల్‌పేట నుంచే కాకుండా జిల్లాల నుంచి అధికంగా గుడుంబా సరఫరా అవుతున్నట్లు సమాచారం. మద్యం అమ్మకాలపైనే ఉన్నతాధికారుల దృష్టి ఎక్సైజ్ శాఖకు ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే మద్యం అమ్మకాలపైనే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల ద్వారా అమ్మకాలు పెంచాలని వత్తిడి చేస్తున్నారు. కానీ అక్రమంగా సాగుతున్న గుడుంబా అమ్మకాలను ఏమాత్రం అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టార్గెట్లు పెట్టి మద్యం విక్రయించా చేస్తున్నారే తప్ప, ఎక్సైజ్ శాఖ అధికారులు గుడుంబా తయారీని, అమ్మకాలను రూపుమాపేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు