పాతబస్తీలో రెండోరోజు బోనాల పండుగ వైభవంగా జరిగింది. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. డప్పు దరువులు, తీన్ మార్ డ...
పాతబస్తీలో రెండోరోజు బోనాల పండుగ వైభవంగా జరిగింది. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. డప్పు దరువులు, తీన్ మార్ డాన్సులు, శివసత్తుల పూనకులతో పాతబస్తీ కోలాహలంగా మారింది. రెండోరోజు బోనాల పండుగలో కీలక ఘట్టం రంగం వేడుక ఘనంగా జరిగింది . అమ్మవారు ఆవహించిన అనురాధ భవిష్యవాణి వినిపించింది. ప్రజలందరినీ చల్లగా చూస్తానని చెప్పింది. రాష్ట్రంలో పాపాలు పెరిగిపోవడం వల్లే వర్షాలు కురవట్లేదని తెలిపింది. అమ్మవారిని దర్శించుకున్న వ్యవసాయశాఖ మంత్రి పోచారం..పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు వైభవంగా జరిగింది. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి జెండా ఊపి ఊరేగింపు ప్రారంభించారు. మహంకాళి ఆలయం నుంచి అమ్మవారు అంబారీపై ఊరేగారు.