జెండా పండుగంటే పిల్లల్లో భలే ఉత్సాహమొస్తుంది. పొద్దున్నే లేచి.. స్నానాలు పూర్తి చేసుకొని… చకాచకా బట్టలేసుకొని.. స్కూల్ కి పరిగెడుతుంటారు...
జెండా పండుగంటే పిల్లల్లో భలే ఉత్సాహమొస్తుంది. పొద్దున్నే లేచి.. స్నానాలు పూర్తి చేసుకొని… చకాచకా బట్టలేసుకొని.. స్కూల్ కి పరిగెడుతుంటారు. జెండా ఎగరేయడం… స్వీట్లు తీసుకోవడం చాలా స్పీడ్ గా జరిగిపోతుంటాయి. ఇది ఏటా జరిగేదే కదా… కొత్తగా ఏముంది అంటారా..? పాపం.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆ ఉత్సాహం.. ఉల్లాసం ఈ సారి కనపడేట్టు లేదు. స్కూల్స్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా… ఇవాళ్టికీ గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కస్తుర్బా స్కూల్స్ లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వలేదు. రాష్ట్రంలో 495 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, 150 గురుకులాలు, కస్తుర్బా విద్యాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో లక్షా 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి చదువుతో పాటు ఉచిత భోజనం, వసతి, ఏడాదికి నాలుగు జతల యూనిఫామ్ అందిస్తోంది గిరిజన సంక్షేమ శాఖ. అయితే ఈ ఏడాది ఇప్పటికీ ఒక్క జత కూడా పంపిణీ చేయలేదు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు సాధారణ దుస్తులతోనే స్కూల్స్ కు వస్తుంటే… అనాథ, పేద గిరిజన విద్యార్థులు చిరిగిన బట్టలతోనే క్లాసులకు అటెండ్ అవుతున్నారు. విద్యార్థులందరికీ వెంటనే యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు.