టీఆర్ఎస్తోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజి...
టీఆర్ఎస్తోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడి సీఈఆర్ క్లబ్లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాలుగు జిల్లాల స్థాయి సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి, డిపెండెంట్ ఉద్యోగాలను, ఖాళీగా ఉన్న 5వేల పోస్టులను, 665గిరిజన అభ్యర్థులకు కేటాయించిన పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కార్మికులకు, నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం జరిగిందన్నారు. టీబీజీకేఎస్‌లో విభేదాలు లేవని, అందరం ఒకటేనన్నారు.
గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీఆర్ఎస్కు అనుబంధంగా టీబీజీకేఎస్‌ను మార్పు చేసినందున ఇక నుంచి సీఎం కేసీఆర్, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ను కలుస్తామన్నారు. ఎంపీ కవిత ఎల్లప్పుడూ పూర్తి అండదండలు ఇస్తూ.. సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. నూతన కమిటీని ఎన్నుకునే బాధ్యతను టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, ఎంపీ కవితలకు అప్పగించాలన్నారు. ఇందుకు ఈ సమావేశంలో పాల్గొన్నవారంతా ఆమోదం తెలిపారు. నూతన కమిటీని నియమించే వరకు పాత కమిటీనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ రాష్ట్ర పరీశీలకులు జీవీకే.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు చేసిన పోరాటం మరవలేనిదన్నారు. సకల జనుల సమ్మె ద్వారా దేశంలోనే సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను చాటిచెప్పిన ఘనత వహించారన్నారు.సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఆవిర్భవించడం కార్మికులు ఆదరించడం చారిత్రాత్మకమన్నారు. మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, డాక్టర్ శంకర్‌నాయక్, కేంద్ర కమిటీ ప్రతినిధులు గోవర్దన్, ఏనుగు రవీందర్, ఏబూసి ఆగయ్య, ఓ.రాజశేఖర్, 11ఏరియాల ఉపాధ్యక్షులు సంగం చందర్, ఆర్.కొమరయ్య, శ్రీనివాసరెడ్డి, సదాశివ్, మేడిపల్లి సంపత్, బడితెల సమ్మయ్య, ఆరెల్లి పోశం, శ్రీనివాస్, రఘువీరారెడ్డి, రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, ముఖ్య నేతలు పాలమల్లీశ్వరి, అన్నపూర్ణ, నిర్మల, బందెల విజేందర్, డప్పుకుమార్, జగన్నాథం, కొంగ బాలకృష్ణ, సంగాల పద్మారావు, బొట్ల స్వామి, టీ.నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.