మెదక్: నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి(67) గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ లో గల స్వగృహంలో ...
మెదక్: నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి(67) గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ లో గల స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయం నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాత్రి నిద్రలోనే మృతిచెందినట్లు నిర్ధారించారు.గుండెపోటుతో మృతిచెందినట్లుగా సమాచారం.
కిష్టారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ప్రస్తుతం ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ రెండుసార్లు పీఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. నారాయణ్‌ఖేడ్ నుంచి మూడోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్లు పంచగామ సర్పంచిగా పనిచేశారు. ఐదేళ్లు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. కిష్టారెడ్డి స్వస్థలం నారాయణ్‌ఖేడ్ మండలం పంచగామ.