గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-1 పరిధిలోని జీడీకే ఒకటో గనిలో మంగళవారం రాత్రి 10గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమా...
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-1 పరిధిలోని జీడీకే ఒకటో గనిలో మంగళవారం రాత్రి 10గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జనరల్ మజ్దూర్ కార్మికుడు కన్నూరి రాజయ్య బొగ్గు కుప్పల కింద కూరుకుపోయి మృతిచెందాడు. గనిలోని 3సీమ్, 31.5 లెవల్లో రాజయ్య పనిచేస్తుండగా అకస్మాత్తుగా పైకప్పు కూలినట్లు తెలిసింది.
రాజయ్య కంటే ముందున్న కార్మికుడు నంబయ్య ప్రమాదం నుంచి త్రుటిలో తప్పిం చుకున్నాడు. సోమవారం రాత్రి జీడికే-2 గనిలో కోల్కట్టర్ కార్మికుడు మాదరవేణ ఐలయ్య గాలి సరఫరా లేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన నుంచి అధికారులు తేరుకోకముందే మంగళవారం రాత్రి ఒకటో గనిలో మరో ప్రమాదం జరగడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. బొగ్గుకుప్పుల మధ్య కూరుకుపోయిన రాజయ్యను బయటకు తెచ్చేందుకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నది.
