-ఎంపీ కవితకు సింగరేణి కార్మిక సంఘం వినతి హైదరాబాద్: కార్మికుల కృషివల్లే సింగరేణి సంస్థ పురోభివృద్ధిలో పయనిస్తున్నదని, సంస్థ లాభాల్లో ...

-ఎంపీ కవితకు సింగరేణి కార్మిక సంఘం వినతి
హైదరాబాద్: కార్మికుల కృషివల్లే సింగరేణి సంస్థ పురోభివృద్ధిలో పయనిస్తున్నదని, సంస్థ లాభాల్లో కార్మిక, ఉద్యోగులకు 25శాతం వాటా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవితకు ఆ సంఘం అధ్యక్షుడు కనకరాజు, ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి మంగళవారం వినతిపత్రం అందజేశారు. గురు, శుక్రవారాల్లో జరిగే సమావేశాల్లో బొగ్గుగని కార్మిక, ఉద్యోగుల సమస్యలను చర్చించి కార్మికులకు చేయూతనందించాలని ఆమెను కోరినట్లు వారు తెలిపారు.