దక్షిణాది చిత్రసీమలో చెన్నై చిన్నది సమంతా హవా కొనసాగుతోంది. ఈ సొగసరి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాలు సాధిస్తున్నాయి. దీంత...
దక్షిణాది చిత్రసీమలో చెన్నై చిన్నది సమంతా హవా కొనసాగుతోంది. ఈ సొగసరి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాలు సాధిస్తున్నాయి. దీంతో ఆమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ సుందరి ప్రస్తుతం తమిళంలో ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. తెలుగులో మహేష్‌బాబు సరసన బ్రహ్మోత్సవం చిత్రంలో నటించబోతున్న సమంతా తాజాగా మరో భారీ అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌మీదకు రానుంది. ఇందులో సమంతాను కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. కథ నచ్చడంతో సమంతా ఈ సినిమాకు వెంటనే అంగీకారం తెలిపిందని తెలుగు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నితిన్ సరసన ఆమె నటిస్తున్న తొలిచిత్రమిదే కావడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో సమంతా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా మలయాళ చిత్రం బెంగళూరు డేస్ తమిళ రీమేక్‌లో సమంతా అతిథి పాత్రలో నటించనుందని తెలిసింది.