జమ్మూ కాశ్మీర్ భూబాగంలో వేర్పాటువాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేర్పాటువాద మహిళా...
జమ్మూ కాశ్మీర్ భూబాగంలో వేర్పాటువాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేర్పాటువాద మహిళాసంస్థ దుఖ్తరన్-ఎ-మిలత్ (డిఇఎం) సభ్యులు ఇవాళ పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీనగర్ శివార్లలోని బచ్పొరా ప్రాంతంలో పాక్ జాతీయ జండా ఎగరేసి.. ఆ దేశ జాతీయగీతాన్ని ఆలపించారు. సంస్థ నాయకురాలు ఆసియా అంద్రబీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేర్పాటువాదులు గత 20 ఏళ్లుగా జమ్మూ కశ్మీర్లో ఆగస్టు 14వ తేదీన పాక్ జెండా ఎగరేస్తూ వస్తున్నారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ భద్రతాసిబ్బంది కళ్లుగప్పి పాక్ జెండాలు ఎగురవేస్తున్నారు. వీటికి తోడు అక్కడ ఐఎస్ ఉగ్రవాద సంస్థల జెండాలు కూడా ఇటీవల రెపరెపలాడుతూ మన భద్రతా సంస్థలకు సవాల్ విసురుతున్నాయి.