కాజల్ అగర్వాల్ తెలుగులో మరో బంపర్ ఆఫర్‌ను దక్కించుకుందా? పవన్‌కల్యాణ్‌తో తొలిసారి జోడీ కట్టనుందా? అంటే ఔననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గ...
కాజల్ అగర్వాల్ తెలుగులో మరో బంపర్ ఆఫర్‌ను దక్కించుకుందా? పవన్‌కల్యాణ్‌తో తొలిసారి జోడీ కట్టనుందా? అంటే ఔననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే...పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. గబ్బర్‌సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సర్దార్ అనే పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. గత నెలలో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.ఇటీవలే పవన్‌కల్యాణ్‌పై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. కథానాయిక స్థానం కోసం పలువురు అగ్రతారల పేర్లను పరిశీలించిన చిత్ర వర్గాలు చివరకు కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. కథానుగుణంగా హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతో ఆమె ఇందులో నటించడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ప్రస్తుతం తెలుగులో బ్రహ్మోత్సవం చిత్రంతో పాటు తమిళంలో నాలుగు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది కాజల్ అగర్వాల్.
Key Tags
Pawan Kalyan ,Kajal ,Sampath Nandi ,Sardaar