-నాట్ స్టాండెట్ క్వాలిటీ జాబితాలో 21 రకాల మందులు -మార్కెట్ నుంచి వెంటనే తొలగించాలి.. డీసీఏ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశం -జాబితాను వ...
-నాట్ స్టాండెట్ క్వాలిటీ జాబితాలో 21 రకాల మందులు
-మార్కెట్ నుంచి వెంటనే తొలగించాలి.. డీసీఏ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశం
-జాబితాను విడుదల చేసిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ
సిటీబ్యూరో-హైదరాబాద్: డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో జులైలో నెలలో రాష్ట్రవ్యాప్తంగా 650 శాంపిల్స్ సేకరించామని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) డైరెక్టర్ జనరల్ అకున్ సబర్వాల్ తెలిపారు. వాటిలో 21 శాంపిల్స్‌లో ప్రామాణికంగా ఉండాల్సిన నాణ్యత లేదని (నాట్ స్టాండెడ్ క్వాలిటీ (ఎన్ఎస్సీ)) విషయం దృష్టికి వచ్చిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాధారణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు నెలకు 200 శాంపిల్స్ సేకరిస్తారని, ఈ నెలలో మాత్రం 650 శాంపిల్స్ సేకరించామని, వాటిని డీసీఏ లాబొరేటరీలో పరీక్షించామని తెలిపారు. నాణ్యత (ఎన్ఎస్సీ)లేని మందులను మార్కెట్ నుంచి వెంటనే తొలగించాలని ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు. నాణ్యత లేని మందులను కొనకూడదని ప్రజలకు అకున్ సబర్వాల్ విజ్ఞప్తి చేశారు.