-రెండింతలైన నిర్మాణ వ్యయం -రూ.3 కోట్లతో రాజస్థాన్ మార్బుల్స్ వినియోగం -పర్సంటేజీలతో పబ్లిక్‌హెల్త్ దోపిడీ హైదరాబాద్ : ప్రజాధనం వృ...
-రెండింతలైన నిర్మాణ వ్యయం
-రూ.3 కోట్లతో రాజస్థాన్ మార్బుల్స్ వినియోగం
-పర్సంటేజీలతో పబ్లిక్‌హెల్త్ దోపిడీ
హైదరాబాద్ : ప్రజాధనం వృథా చేయడంలో పబ్లిక్‌హెల్త్ విభాగం అధికారులు ముందున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన భవన నిర్మాణ పనులు ఏండ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఫలితంగా నిర్మాణం వ్యయం రెట్టింపయింది. ఏసీగార్డ్స్‌లోని పురపాలక పరిపాలన శాఖ కేంద్ర కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న పట్టణ-గ్రామీణ ప్రణాళిక సంచాలకుల భవనం పబ్లిక్‌హెల్త్ ఉన్నతస్థాయి అధికారుల లోపాయికారి వ్యవహారానికి నిదర్శనంగా మారింది.
ప్రారంభంలో రూ.13 కోట్లు... ప్రస్తుతం రూ.32 కోట్లు
పట్టణాలు, నగరాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పట్టణ, గ్రామీణ ప్రణాళిక సంచాలకుల కార్యాలయానికి నూతన భవనం నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో గ్రౌండ్‌ఫ్లోర్, ఐదు అంతస్థుల భవనంతోపాటు రెండు ఫ్లోర్ల సెల్లార్ పార్కింగ్తో భవనం నిర్మించాలి. నిర్మాణ బాధ్యతలను పబ్లిక్‌హెల్త్ విభాగానికి అప్పగించారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రూ.13 కోట్ల వ్యయంతో డీటీసీపీ భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి సీఎం వైఎస్సార్‌తో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉన్నతస్థాయి అధికారుల లోపాయికారి వ్యవహారంతో కాంట్రాక్టర్ స్లాబ్ పనులు పూర్తిచేసి తప్పుకున్నాడు. ఏడాదిలో పనులు పూర్తిచేయాల్సి ఉండగా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇంతలో మరో ఉన్నతాధికారి పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఉన్నా అధికారులు లక్షల్లో డబ్బులు చెల్లించి ముంబాయి కన్సల్టెన్సీ ప్లాన్ మేరకు పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తున్నది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్లు నిర్మాణ వ్యయం గణనీయంగా పెంచుతూ వచ్చారు. దీంతో 2013లో మరో రూ.17 కోట్లు కేటాయించి ఖరీదైన ైస్లెడింగ్, బాత్రూంలు, అంతర్గంగా అత్యాధునిక ఫిట్టింగ్‌లతో పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఏడాదికాలంలోనే నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
భవనం చుట్టూ ైస్లెడింగ్ కోసం రాజస్థాన్ నుంచి అత్యంత ఖరీదైన ఎరుపు మార్బుల్స్ తెప్పించారు. వీటికి రూ.3 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. హంగూ, ఆర్బాటం పేరుతో కమీషన్లు పొందేందుకు భవనంలో అత్యాధునిక సదుపాయాలను కల్పించేందుకు నిర్మాణ వ్యయం పెంచుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా భవనం నిర్మాణ పనులు నత్తను మరిపిస్తున్నాయి. సరైన భవనాలు లేనికారణంగా నిర్మాణ పనులు జరుగుతుండగానే ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయాలు ఇందులో కొనసాగుతున్నాయి. పనులు మరో ఏడాదిపాటు కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏడాదికాలంగా తిష్టవేసిన పక్కరాష్ట్ర పబ్లిక్‌హెల్త్ ఉన్నతాధికారి హయాంలో అన్ని పనులు సాగుతూనే ఉన్నాయన్న విమర్శలున్నాయి. ఇక భవన నిర్మాణం పూర్తయ్యే సరికి మొత్తం ఖర్చు రూ.32 కోట్లకు చేరే అవకాశముంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.