జంతర్ మంతర్ దగ్గర రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల ఆందోళన వన్ ర్యాంక్ వన్ పెన్షన్. సమాన హోదాకు సమాన పెన్షన్ డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది...
జంతర్ మంతర్ దగ్గర రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల ఆందోళన
వన్ ర్యాంక్ వన్ పెన్షన్. సమాన హోదాకు సమాన పెన్షన్ డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఓ వైపు దేశం స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగిపోయిన టైంలో.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల డిమాండ్.. రీసౌండ్ ఇస్తోంది. వేలాదిమంది మాజీ సైనిక ఉద్యోగులు జంతర్ మంతర్ వేదికగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఉద్యమించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మద్ధతు ప్రకటించారు. జంతర్ మంతర్ కు వెళ్లి వాళ్లకు సపోర్ట్ చేశారు. వాళ్ల డిమాండ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ లోనూ తన ఒపీనియన్ ని పోస్ట్ చేశారాయన. అయితే అంతకుముందు రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు రిటైర్డ్ ఉద్యోగులు. నిజానికి యూపీఏ హయాంలోనే సమాన హోదాకు సమాన పెన్షన్ డిమాండ్ వచ్చింది. దాన్ని అమలు చేస్తామని యూపీఏ హామీ కూడా ఇచ్చింది. ఆరేళ్ల క్రితం హామీని అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కూడా. అయినా యూపీఏ హయాంలో OROP స్కీమ్ అమలు కాలేదు. అందుకే రాహుల్ పై ఫైరయ్యారు మాజీ ఉద్యోగులు. దశాబ్దకాలంగా పొలిటికల్ పార్టీస్ కి ఓటు బ్యాంక్ గా మారిన ఈ హామీ… మోడీ సర్కారుకు సమస్యలా మారింది. ఓకే చేస్తే వెంటనే 8 వేల కోట్లకు పైగా భారం పడే అవకాశముంది. దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది ఆర్మీ ఉద్యోగులున్నారు. వాళ్లందరికీ OROP స్కీంను అమలు చేయాలంటే సుమారు 20 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం తప్పదంటోంది కేంద్ర ఆర్థిక శాఖ. నిజానికి గత ఎన్నికల్లో మోడీ ఈ హామీని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అధికారంలోకొచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రామిస్ చేశారు. అదే హామీని మాజీ ఉద్యోగులు గుర్తుచేస్తున్నారిప్పుడు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ పై అన్ని వైపులా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సర్కారు ఈ హామీని అమలు చేయకపోతే.. రామ్ లీలా మైదాన్ వేదికగా ఆమరణ నిరహార దీక్ష చేస్తానని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు మరోసారి సీరియస్ గా రియాక్ట్ అయింది. మూడు నెలల్లోనే స్కీంను అమలు చేయాలని ఆదేశించింది. ఆర్నెళ్లైనా సర్కారు దీన్ని అమలు చేయట్లేదు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ కూ మాజీ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. అయినా సర్కారులో కదలిక రాలేదు. దీనిపై ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో ప్రధాని మోడీ ప్రకటించే అవకాశముందని తెలు