క్వారీ వద్దంటూ కారేగాం గ్రామస్తుల ఆందోళన అడ్డుకుంటే ఊరుకునేది లేదంటూ పోలీసుల హెచ్చరిక ఇప్పటికే పలువురిపై బైండోవర్ కేసులు నమోదు కార...

క్వారీ వద్దంటూ కారేగాం గ్రామస్తుల ఆందోళన
అడ్డుకుంటే ఊరుకునేది లేదంటూ పోలీసుల హెచ్చరిక
ఇప్పటికే పలువురిపై బైండోవర్ కేసులు నమోదు
కారేగాం (కోటగిరి) : కారేగాంలో ఇసుక క్వారీ వ్యవహారం తుపాను సృష్టిస్తోంది. ఇక్కడ క్వారీ వద్దంటే వద్దంటే గట్టిగా పట్టుబడుతున్నారు. క్వారీని అడ్డుకుంటే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాత్కాలికంగా ఆగిపోరుున క్వారీని తిరిగి కొనసాగించేందుకు తెలంగాణ స్టేట్ మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ ఎండీసీ) అధికారులు రంగం సిద్ధం చేశారు.
ఇదీ నేపథ్యం
కారేగాం ఇసుక క్వారీ నుంచి ఇసుక తరలించేందుకు స్థానిక కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో ఇటీవల సుమారు 23వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను మంజీరా నది నుంచి తరలించింది. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు పడిపోతాయంటూ గ్రామస్తులు అడ్డుకోవడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. క్వారీని అడ్డుకోవద్దంటూ గ్రామస్తులపై సంబంధిత అధికారులు ఒత్తిడి తెచ్చారు. పలుమార్లు చర్చించారు. ఫలితం లేకపోవడంతో ఒక దశలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పెద్దలు కొందరు జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆశ్రయించారు. మొత్తం విషయూన్ని ఆయన సంబంధిత మంత్రి హరీశ్‌రావ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మౌఖిక ఆదేశంతో కొన్ని రోజులపాటు తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచిపోయింది.
తాజా పరిణామాలు
కారేగాం ఇసుక క్వారీ నుంచి ఇసుకను ఎలాగైనా తరలించేందుకు సంబంధిత అధికారులు రంగం సిద్ధం చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. ఇసుక రవాణాకు యంత్రాలను రప్పించారు. ఒకటి, రెండు రోజుల్లో ఇసుక రవాణా ప్రారంభించే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోనే మొదటిసారిగా టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇసుక క్వారీని అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీషీట్ ఓపెన్ చేరుుస్తామని సంబంధిత అధికారులు హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఎనిమిది గ్రామస్తులపై బైండోవర్ కేసులు నమోదు చేరుుంచారు. క్వారీ కొనసాగేందుకు సహకరించాలని గ్రామస్తులను బోధన్ ఆర్డీఓ ఇప్పటికే పలుమార్లు కోరారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కారేగాం గ్రామంలో మోహరించారు.
భూగర్భ జలాలు ఇంకిపోతాయనే భయంతోనే...
భూగర్భ జలాలు ఇంకిపోతాయనే భయంతోనే ఇసుక క్వారీ వద్దంటున్నామని కారేగాం గ్రామస్తులు చెబుతున్నారు. ‘‘ఒకవైపు వర్షాల్లేక చెరువులు, కుంటలు ఎండిపోతున్నారుు. ఇప్పటికే బోర్లు వట్టిపోయూరుు. ఈ పరిస్థితుల్లో ఇసుకను తోడేస్తే కొద్దిపాటిగా ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటే ప్రమాదముంది. కారేగాం మంజీరా తీరంలో డీఫ్లోరైడ్ స్కీం, ఎత్తిపోతల పథకాలు ఉన్నారుు. డీఫ్లోరైడ్ పథకం ద్వారా సుమారు 23 గ్రామాలకు రక్షిత నీరు అందుతోంది. ఇసుక తరలింపుతో ఇవన్నీ మూలనపడతారుు. అందుకే.. ఇసుకను తవ్వవద్దని కోరుతున్నాం’’ అని గ్రామస్తులు చెబుతున్నారు.