ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లో కేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి ప...
ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లో కేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధం. రోడ్ల మీద, మురికికాల్వల పక్కన, బాగా మరగకాచిన నూనెతో వండిన పదార్థాలను తిని రోగాల బారినపడుతున్నారు. పిల్లలు ఇష్టపడతారని స్నాక్స్ పేరుతో నూడిల్స్, పానీపూరి, బేకరీ ఐటమ్స్ వంటిని అందిస్తుంటాం. అయితే, ఇవి ఆరోగించే సమయంలో నోటికి ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ… ఆ తర్వాత అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటాం. జంక్ఫుడ్స్ తినడం వల్ల ఒబెసిటీ, దీర్ఘకాలిక వ్యాధులొస్తాయని వైద్యుల హెచ్చరిస్తున్నారు. చిన్నారు ఎక్కువగా ఈ తరహా ఫుడ్స్ ఆరగించడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి, పెద్దల్లో పొట్ట సైజు పెరగడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి.
ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒబెసిటి బారిన పడే వారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతూనే ఉంది. వీరిలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం లెక్కల ప్రకారం 17.6 శాతం పురుషులు, 27.7 శాతం స్త్రీలు ఒబెసిటీతో బాధపుడుతున్నారు. చిన్నారుల్లో 21 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు.
జంక్ ఫుడ్స్‌పై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. ప్రాశ్యాత్య సంస్కృతిని అనుకరించడం తగ్గించుకోవాలి. ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. పిల్లలకు జంక్ ఫుడ్స్ ఇవ్వడం తగ్గించాలి. ఇంట్లో వండిన పదార్థాలనే ఆరగించేలా చర్యలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ ఆరగించడం వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి.