మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకరు… పంకజ చెప్పులు మోయడ...
మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకరు… పంకజ చెప్పులు మోయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. రాష్ట్రంలో కరవు సంభవించిన పర్భానీ జిల్లా సొన్ పెత్ ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఆ సందర్భంగా పంకజ ముండే అక్కడ చెప్పులతో నడవడానికి కష్టంగా ఉందని… వాటిని విడిచి ఒట్టి కాళ్లతోనే నడక సాగించారు. అయితే మంత్రి విడిచిన చెప్పులు ఓ సిబ్బంది చేతుల్లో పట్టుకుని మోశారు. ఈ విషయాన్ని పలు టీవీ ఛానల్స్ ఫోకస్ చేశాయి. దీంతో ప్రతిపక్షాలు.. మెయిన్ గా కాంగ్రెస్ నేతలు ఈ ఇష్యూపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి మాత్రం ‘మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని, చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చిందని తెలిపారు. అయినా చెప్పులు మోసిన ‘ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది’ అని మంత్రి పంకజ క్లారిటీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్ నస్సీర్ జకారియా మాత్రం.. ఈ ఇన్సిడెంట్ మంత్రి వ్యక్తిత్వాన్ని తెలుపుతోందని..ఓ పేదవాడితో చెప్పులు మోపించిన మంత్రి… రైతులకు, సాధారణ ప్రజలకు ఏం సేవ చేస్తారని విమర్శించారు.