తెలంగాణ రాష్ట్ర సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించే గ్రూప్స్ పరీక్షా సిలబస్‌లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వుల...
తెలంగాణ రాష్ట్ర సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించే గ్రూప్స్ పరీక్షా సిలబస్‌లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసి జీవో నంబర్ 330లో స్వల్ప మార్పులు సూచిస్తూ తాజాగా జీవో నంబర్ 342ను విడుదల చేసింది. గ్రూప్-2 పరీక్షా ప్రణాళికలోని పార్ట్ ఏ పేపర్-2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ అంశంలో ముందుగా చేర్చిన సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్‌కు బదులుగా, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆండ్ తెలంగాణను చేర్చింది. గ్రూప్ 4 పేపర్ 1లోని జనరల్ నాలెడ్జ్‌ను జనరల్ స్టడీస్‌గా మార్చింది.
