-పది రోజులపాటు స్టాప్ ది డయాబెటీస్ కార్యక్రమం హైదరాబాద్: మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు సింగరేణి కార్మికులకు యోగా శిక్షణ ఇవ్వనున్నట్...

-పది రోజులపాటు స్టాప్ ది డయాబెటీస్ కార్యక్రమం
హైదరాబాద్: మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు సింగరేణి కార్మికులకు యోగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెంగుళూరుకు చెందిన వివేకానంద యోగా విశ్వ విద్యాలయం వారితో రామగుండం-2, రామగుండం-3, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో తొలివిడత 300 మంది కార్మికులు, ఉద్యోగులకు ఈనెల 28 నుంచి పదిరోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా స్టాప్ ది డయాబెటీస్ కార్యక్రమం ద్వారా పదిరోజులపాటు యోగా-ప్రాణాయామం-ధ్యానం-శ్వాస మీద ధ్యాస వంటి అంశాల ద్వారా మధుమేహాన్ని దూరం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.