ఢిల్లీలో పాక్ ఎంబసీలో స్వతంత్ర వేడుకలను గ్రాండ్ గా నిర్వహించింది దాయాది దేశం. సంప్రదాయ నృత్యాలతో ఘనంగా జరుపుకుంది. పాకిస్తాన్ హై కమిషనర్ ...
ఢిల్లీలో పాక్ ఎంబసీలో స్వతంత్ర వేడుకలను గ్రాండ్ గా నిర్వహించింది దాయాది దేశం. సంప్రదాయ నృత్యాలతో ఘనంగా జరుపుకుంది. పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ పాకిస్తాన్ జెండాను ఎగరేసారు. బ్రిటీష్ పాలనలో భారత్ రెండుగా విడిపోయింది. పాకిస్తాన్ కు ఓరోజు ముందు స్వతంత్రం వచ్చింది. ఢిల్లీలో పాక్ ఎంబసీలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకలకు పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ హాజరయ్యారు. రెండు దేశాలు ఉద్రిక్తతలు పక్కనపెట్టి.. సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు బాసిత్. భారత్ తో మంచి సంబంధాలను పాకిస్తాన్ ఎప్పుడూ కోరుకుంటుందన్నారాయన. కాశ్మీర్ విషయంలో భారత్ సహకరించాలన్నారు…. వాళ్ల ఫ్రీడం కోసం ఫైట్ చేస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల క్రితం రష్యాలో భారత్-పాక్ ప్రధానులు మీటయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల కోసం సహకరించుకుందామని ప్రామిస్ చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందం తర్వాత బోర్డర్ లో పాక్ రెచ్చిపోతోంది. ఓ వైపు కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూనే… సంబంధాలు మెరుగుపర్చుకుందామని డబుల్ గేమ్ అడుతోంది. ఇపుడు ఢిల్లీ వేదికగా… కశ్మీరీల స్వతంత్రం కోసం ఫైట్ చేస్తామనడం పాక్ వైఖరిని మరోసారి బయటపెట్టింది.