చెమట చుక్కలనే ఇంధనంగా మార్చి మగ్గాలను ఆడించే నేతన్నల జీవితాలకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు భద్రమైన భరోసా కల్పించేలా చర్యలు త...
చెమట చుక్కలనే ఇంధనంగా మార్చి మగ్గాలను ఆడించే నేతన్నల జీవితాలకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు భద్రమైన భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. రంగుదారాలతో జీవితాన్ని అల్లుకున్న కార్మికులకు రక్షాబంధన్ కానుక ఇవ్వనున్నారు. ఇందుకోసం సిరిసిల్ల నియోజకవర్గంలోని చేనేత, పవర్ లూ మ్ కార్మికులందరికీ ఈ ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ సురక్షా భీమా యోజన ద్వారా కార్మికులందరికీ భీమా సౌకర్యాన్ని కల్పిస్తు న్నారు. ఈ ప్రమాద భీమాతో కార్మికుల కుటుంబాలకు ధీమా కలుగుతుందని మంత్రి తారకరామారావు తెలిపారు. ఈ భీమా సౌకర్యంతో కార్మికులకి…. 2 లక్షల ప్రమాధ భీమాతో పాటు, రెండు లక్షల శాశ్వత అంగవైకల్య భీమా భరోసా ఉంటుంది. పాక్షిక అంగవైల్యానికి గురైతే లక్ష రూపాయాల భీమా సౌకర్యం ఉంటుంది. సిరిసిల్లాలో నియోజక వర్గంలో ఉన్న సూమారు 25 వేల మంది కార్మికులకి సంవత్సరానికి అవసరమైన వార్షిక భీమా ప్రీమియంను మంత్రి కె.తారక రామరావు సొంతంగా చెల్లించనున్నారు. ఈ భీమా సౌకర్యాన్ని పొందేందుకు సిరిసిల్లాలో కార్మికులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనది. ఇప్పటిదాకా సూమారు 20 వేల మంది కార్మికులను గుర్తించారు. 18 సంవత్సరాలు నిండిన కార్మికుల నుండి 70 సంవత్సతాల వయస్సు ఉన్న ప్రతి ఓక్కరికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. వీరందరికి భీమా సౌకర్యం కల్పించేలా…. ఇందుకోసం కార్మికులందరికి బ్యాంకు అకౌంట్లు తెరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకి బ్యాంకులతో ఓక సమావేశాన్ని నిర్వహించారు. రక్షబందన్ పండగ నాటికి సిరిసిల్లాలోని ప్రతి కార్మికునికి భీమా సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తన సిబ్బందిని అదేశించారు.
