పొద్దంతా పని చేసిన ఆ డైలీ లేబర్.. నాలుగు చుక్కలు గొంతులో పోసుకుందామని వైన్ షాపుకెళ్లాడు. లిక్కర్ తీసుకున్నాడు. హడావుడిగా బాటిల్ ఓపెన్ చేశ...
పొద్దంతా పని చేసిన ఆ డైలీ లేబర్.. నాలుగు చుక్కలు గొంతులో పోసుకుందామని వైన్ షాపుకెళ్లాడు. లిక్కర్ తీసుకున్నాడు. హడావుడిగా బాటిల్ ఓపెన్ చేశాడు. ఇక అంతే చిర్రెత్తుకు వచ్చింది. ఏమయ్యిందిరా అని బాటిల్ పరిశీలనగా చూస్తే దానిలో బొద్దింక గుడ్లు ఉన్నాయి. అసలే మందు దాహంతో ఉన్న మనోడు .. షాపు ఓనర్ తో గొడవకు దిగాడు. కాళ్ల బేరానికి వచ్చిన వాళ్లు… ఆ బాటిల్ ఇచ్చేస్తే.. కొత్త బాటిల్ ఇస్తామన్నారు. అయినా వినకుండా.. దాన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. ఇదంతా తమిళనాడులోని కోయంబత్తూర్ లో జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.