ఓ ప్రభుత్వాసుపత్రిలో అదే రోజు పుట్టిన పసికందును పీక్కుతిన్నాయి ఎలుకలు. దాంతో ప్రాణాలు కోల్పోయింది ఆ పసిగుడ్డు. వివరాల్లోకి వెళితే గుంటూరు...
ఓ ప్రభుత్వాసుపత్రిలో అదే రోజు పుట్టిన పసికందును పీక్కుతిన్నాయి ఎలుకలు. దాంతో ప్రాణాలు కోల్పోయింది ఆ పసిగుడ్డు. వివరాల్లోకి వెళితే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి. రోజుల పసిబిడ్డ కావడంతో ఆ బాధకు గుక్కపట్టి ఏడవడంతో, ఏడుపు విని నిద్రలేచిన తల్లి ఎలుకలు తన బిడ్డను కొరుక్కుతినడం చూసి, వెంటనే బిడ్డను చికిత్స కోసం వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. ఆ బిడ్డకు వైద్యులు చికిత్సనందించినా కాడా ఆ పసికందు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచారు. ఆసుపత్రిలో అపరిశుభ్రత కారణంగా ఎలుకలు సంఖ్య పెరిగి చివరకు ప్రాణాలను తీస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
