మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి యాత్ర రాష్ట్రానికి చేరుకుంది. ఈ నెల 9న తమిళనాడులోని పెరంబదూర్ నుంచి ప్రారంభమైన యాత్ర పలు రాష్ట్...
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి యాత్ర రాష్ట్రానికి చేరుకుంది. ఈ నెల 9న తమిళనాడులోని పెరంబదూర్ నుంచి ప్రారంభమైన యాత్ర పలు రాష్ట్రాల మీదుగా హైదరాబాద్ వచ్చింది. గాంధీ భవన్ లో సద్భావన యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ లీడర్స్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత గాంధీ కుటుంబానిదన్నారు పీసీసీ నేతలు. దేశ ప్రజలకు సాంకేతికతను దగ్గర చేశారని చెప్పారు. ఓటు హక్కును 18 ఏళ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం రాజీవ్ కృషి చేశారని గుర్తు చేశారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన రాజీవ్ కుటుంబంపై కేంద్ర సర్కార్ విమర్శలు చేయడం సరికాదన్నారు నేతలు. టెర్రరిజానికి వ్యతిరేకంగా 24 ఏళ్లుగా రాజీవ్ సద్బావన యాత్ర నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈనెల 20న రాజీవ్ జయంతికి సద్భావన యాత్ర ఢిల్లీ చేరుకోనుంది.