చెన్నూర్ రూరల్: మండలంలోని గంగారం గ్రామంలో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరం దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసు...
చెన్నూర్ రూరల్: మండలంలోని గంగారం గ్రామంలో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరం దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ చందర్ తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారనే అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేసి పందాలు కాస్తున్న వ్యక్తులతో పాటు వారి వద్ద నుంచి నాలుగు పందెం కోళ్లను, నా లుగు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.