ఖజానా ఫుల్లు. ప్రాబ్లమ్స్ నిల్లు. సంక్షేమ పథకాల అమలుకు ఢోకాలేదు. కొత్త స్కీంలకు నో ఫికర్. ఇవీ ఆర్థిక మంత్రి ఈటెల శాఖల రివ్యూ అప్డేట్స్....
ఖజానా ఫుల్లు. ప్రాబ్లమ్స్ నిల్లు. సంక్షేమ పథకాల అమలుకు ఢోకాలేదు. కొత్త స్కీంలకు నో ఫికర్. ఇవీ ఆర్థిక మంత్రి ఈటెల శాఖల రివ్యూ అప్డేట్స్. స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సూపర్ గా ఉందన్నారు మంత్రి. రాబడి.. ఖర్చు ఈక్వల్ గా ఉందని చెబుతున్నారు.
ఆదాయ, వ్యయాలపై రివ్యూ
ఈ ఆర్థిక ఏడాది ఆదాయ, వ్యయాలపై అధికారులతో రివ్యూ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల. ఈ ఆర్థిక ఏడాదిలో 5 నెలల్లో సర్కార్ 43 వేల కోట్లను రెవెన్యూ టార్గెట్ గా పెట్టుకుంది… ఇందులో 37 వేల 534 కోట్లు ఆదాయం సమకూర్చోగలిగింది. ఖర్చు కూడా దాదాపు అదే స్థాయిలో ఉందని చెబుతోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాల్లో 5 నెలల్లో 37 వేల 369 కోట్లు వెచ్చించింది. అయితే భూముల అమ్మకాలతో రావాల్సిన రాబడి రాలేదని… కేవలం 250 కోట్లు మాత్రమే వచ్చిందని వివరించారు.
ఆడిటింగ్ పై ప్రత్యేక దృష్టి
ఇక నిధుల దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. శాఖల వారీగా మానిటరింగ్ చేసేందుకు ఆడిటింగ్ ను బలోపేతం చేయనున్నట్టు ప్రకటించింది. రుణమాఫీ, స్థానిక సంస్థలు, యూనివర్సిటీల నిధుల్లో అక్రమాలకు పాల్పడినట్టు రుజువైందని చెప్పారు మంత్రి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం.
కేంద్రమంత్రి పాశ్వన్ తో భేటీ
మరోవైపు రాష్ట్రానికి బియ్యం కోటాను పెంచాలని కేంద్రాన్ని కోరారు ఈటెల. హైదరాబాద్ లో కేంద్ర పౌరసరఫరాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిశారు ఈటెల. రాష్ట్రానికి నెలకు 68 వేల 500 మెట్రిక్ టన్నులు అదనంగా కేటాయించాలని కోరారు. అటు కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్ కు రే రైస్ ను 30 రూపాయలకు పెంచాలని బాయిల్డ్ రైస్ కు 50 రూపాయలకు పెంచాలని పాశ్వాన్ ను కోరారు.
అప్పులపై తొందరపడని సర్కార్
ఖజానా పరిస్థితి బాగుండటంతో .. కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రకారం 15 వేల కోట్లు రుణం తీసుకునే చాన్సున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు 7 వేల కోట్లు అప్పే తీసుకుంది. అటు గుజరాత్, తెలంగాణ మిగులు రాష్ట్రాలని.. ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ స్పష్టం చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆర్థిక పరిస్థిపై ఆందోళన చెందవద్దని ప్రకటించింది ప్రభుత్వం.