-ఏజెన్సీ కేంద్రంగా యువతుల అక్రమ రవాణా -ఉద్యోగాల పేరిట నమ్మించి ఉత్తర భారతానికి -రాజస్థాన్‌లో విక్రయాలు.. బలవంతపు పెళ్లిళ్లు -బంధు...
-ఏజెన్సీ కేంద్రంగా యువతుల అక్రమ రవాణా
-ఉద్యోగాల పేరిట నమ్మించి ఉత్తర భారతానికి
-రాజస్థాన్‌లో విక్రయాలు.. బలవంతపు పెళ్లిళ్లు
-బంధువులు, పరిచయస్తులే సూత్రధారులు
-తాజా ఘటనతో వెలుగుచూస్తున్న దారుణాలు
ఆదిలాబాద్: నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు. ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పి అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నారు. రాజస్థాన్ తీసుకెళ్లి అంగట్లో పశువుల్లా అమ్మేస్తున్నారు. బలవంతపు పెళ్లిళ్లు చేసి హింసిస్తున్నారు. ఏజెన్సీలో ఇప్పటికే పెద్దసంఖ్యలో గిరిజన యువతులను ఇలాగే రాష్ట్ర సరిహద్దులు దాటించినట్లు తెలుస్తుండగా, తాజాగా ఇంద్రవెల్లి ఘటనతో ఈ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏజెన్సీలో గిరిజన యువతులకు మా యమాటలు చెప్పి అక్రమంగా తరలిస్తున్నారు. ఇ ప్పటికే పెద్ద సంఖ్యలో అమ్మాయిలను రాజ స్తాన్‌కు విక్రయించినట్లు తెలిసింది. తాజాగా ఇం ద్రవెల్లి ఘటనతో దారుణాలు ఒక్కొక్కటిగా వెలు గు చూస్తున్నాయి. మొన్న : కెరమెరి మండలం నాగల్‌గొందికి చెం దిన ఓ బాలికను తన బంధువులే అక్రమంగా తరలించి రాజస్థాన్‌లోని జూల్వాడ్ జిల్లా చెలోలాస్ అనే గ్రామానికి చెందిన వ్యక్తికి రూ. 1.05 లక్షల కు అమ్మేశారు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రు లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. పోలీసులు స్పందించి.. రాజస్థాన్ వెళ్లి ఆ బాలికను తీసుకొచ్చారు. ఇలాంటివాళ్లు రాజస్థాన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు జిల్లా అధికారుల ముందు ఆ బాలిక సాక్ష్యమిచ్చింది. పోలీసులు అ రెస్టు చేసిన ఓ ముఠాలోని సభ్యులు కూడా ఈ వి షయాన్ని అంగీకరించారు. వాళ్లంతా తమ ఇష్టంతోనే రాజస్థాన్‌కు చెందిన వారితో పెళ్లిళ్లు చే సుకున్నట్లు, ఈ ముఠాలో ఉన్నవారి బంధువుల అ మ్మాయిలకు కూడా అక్కడి వారితో పెళ్లిళ్లు చేసిన ట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. నిన్న: ఊట్నూరు మండలం సాలెవాడకు చెం దిన మరప లలిత, నార్నూరు మండలం ఖడ్కికి చెందిన మడవి రుక్మాబాయి ఎనిమిది నెలల క్రి తం కనిపించకుండా పోయింది. ఇంద్రవెల్లికి చెం దిన ముగ్గురు వ్యక్తులు తమకు తెలిసిన వారు, బంధువుల అమ్మాయిలతో చనువుగా ఉండి.. ఇం ద్రవెల్లిలో మీ అన్న ఉన్నాడని.. రమ్మంటున్నారని, ఉద్యోగం ఉందని చెప్పి తీసుకొచ్చారు. ఆదిలాబాద్‌లో ఉన్నాడని చెప్పి తెచ్చి.. రాజస్థాన్ వారికి విక్రయించారు. వారు రాజస్థాన్ తీసుకెళ్లి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. ఒక్కో అమ్మాయిని రూ.1.30లక్షల చొప్పున విక్రయించారు. 15 రోజుల క్రితం లలిత తన అన్న హన్మంతరావుకు ఫోన్ చేసి.. తనను రాజస్థాన్‌లో విక్రయించారని సమాచారం ఇచ్చింది. ఇంద్రవెల్లి మండలం గో పాల్ సింగ్ తాండకు చెందిన నిస్తే హరిసింగ్ ప్రధాన సూత్రధారని.. కేస్లాగూడకు చెందిన మడావి భీంరావు, పిప్రికి చెందిన షాహకటి జం గు పాత్రధారులని వివరించింది. దీంతో ఆమె అ న్న కులపెద్దలు, గ్రామ ప్రజలతో చర్చించారు. శనివారం ఇంద్రవెల్లి మండలం ముతునూరు గ్రామ శివారులో మూడు గ్రూపులుగా ఏర్పడి ముగ్గురు ముఠాను పట్టుకున్నారు. వారిని నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. అనంతరం పోలీసులకు ఫి ర్యాదు చేశారు. 15 రోజుల క్రితం వచ్చిన నెంబరుకు కాల్ చేసి.. లలితతో మాట్లాడినట్లు ఉట్నూ రు డీఎస్పీ వెంకటేశ్వర్లుకు వివరించారు. వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు ఇద్దరిని విక్రయించామని ఒప్పుకున్నారు. మరో వైపు పోలీసుల విచారణలో పూర్తి విషయా లు బ యటపడనున్నాయి. ప్రత్యేక బృందాల ను రాజస్థాన్ పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు. అయినవారే అసలు సూత్ర,పాత్రధారులు ఏజెన్సీ ప్రాంతంలో అమ్మాయిల అక్రమ రవాణాలో అయినవారే అసలు సూత్ర, పాత్రధారులు గా ఉంటున్నారు. పెళ్లిళ్లు, ఉపాధి, ఉద్యోగం, డ బ్బుల ఆశ చూపి.. తెలిసిన అమ్మాయిలు, బంధువుల అమ్మాయిలను అక్రమంగా రాజస్థాన్‌కు అ మ్మేస్తున్నారు. ఇందులో చాలా వరకు తల్లిదండ్రులకు తెలియకపోగా.. తర్వాత తెలిసినా ఎలాగూ పెళ్లి అయిపోయిందని వదిలేస్తున్నారు. ఆర్థిక ఇ బ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆదివాసీ, ఇతర గిరిజన కుటుంబాల్లోని మైనర్ అమ్మాయిలు, యువతులపై కన్నేస్తున్న ముఠాలు మాయ మా టలు చెప్పి రాజస్థాన్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో ఇప్పటికే అనేక మంది అమాయక బాలికలను రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు, జైనూరు, కెరమెరి మండలాల్లోని కొందరు రాజస్థాన్ వారితో పరిచ యం పెంచుకుని.. తమ ప్రాంతంలోని అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ తతంగం లో తాజాగా నార్నూరు మం డలం కడికికి చెందిన మడావి రుక్మాబాయి జాడ తెలియలేదు. ఏడాది క్రితం కెరమెరి, నార్నూరు మండలాల నుంచి కొందరిని విక్రయించారు. వారు ఏం చేశారో.. తెలియదు కాని.. తమ ఇష్టపూర్వకంగా వెళ్లామని పెళ్లి చేసుకున్నామని చె బుతుండడం గమనార్హం. పోలీసుల దృష్టికి రానివే అధికం ఆసిఫాబాద్, వాంకిడి, ఉట్నూర్, కెరమెరి, బే ల, మంచిర్యాల, ఇంద్రవెల్లి, బాసర వంటి ప్రాం తాల నుంచి ఎక్కువగా బాలికల అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ సర్వేలో తే లింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి కనిపించకుండా పోతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. పెళ్లిళ్ల పేరుతో తరలిపోయేవారు కొందరైతే.. తల్లిదండ్రులకు తెలియకుండానే అక్రమం గా తరలింపునకు గురయ్యేవారు మరికొందరు. జిల్లాలోని గిరిజన బాలికలే ఎక్కువగా ట్రాఫికర్ (అమ్మాయిలను అక్రమంగా తరలించేవారు) బా రిన పడుతున్నారు. జిల్లాలో బాలికలు మాయమవుతున్నా.. పోలీసుల దృష్టికి రావడం లేదు. కొన్ని కేసులు బయటికొస్తున్నా.. పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. అవమానాల పాలవుతామని, కుటుంబం బజారున పడుతుందనే మానసిక క్షోభతో పోలీసులను ఆశ్రయించకపోవడంతో ముఠాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పో యింది. ఏజెన్సీ ప్రాంతాల్లో బాలికలకు ఆకర్షనీయమైన వస్తువులు, అలంకరణ వస్తువులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. నిరుపేదలైన తల్లి తండ్రులు వారి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చే యలేక పోతున్న విషయాన్ని పసిగట్టి.. ఇతర రా ష్ర్టాలకు చెందిన వారితో పెళ్లి చేసి మరీ అక్రమంగా తరలిస్తున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో సంబంధాలు తెగిపోయి ఇక్కడ తల్లిదండ్రులు, అక్కడ యువతులు నరకయాతన పడుతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు స్థానిక ముఠాలు యువతులను తీసుకురాగా.. అ క్కడి నుంచి రైళ్లలో రాజస్థాన్ తీసుకెళ్తున్నారు. వ్యభిచార గృహాలకూ రవాణా మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లోని గ్రామాల్లో మైనర్ అమ్మాయిలు, యువతులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరిలో కొందరిని మహారాష్ట్రలోని చంద్రపూర్, నాగపూర్, ఢిల్లీ, ఆగ్రాలోని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారు. ఇటీవల చంద్రాపూర్, బల్లార్శ, యావత్మాల్లో లాడ్జిలు, వ్యభిచార గృహాలపై దాడులు చేయగా.. జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన యువతులు ఉండడం గమనార్హం. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠాలు.. నిరుపేద అమ్మాయి ల కుటుంబాలకు మాయమాటలు చెప్పి,కొంత డ బ్బు ముట్టజెప్పి అమ్మాయిలను తరలిస్తున్నారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు అనేక చట్టాలుండగా.. ఇందులో ఐటీపీఏ యాక్ట్ ముఖ్యమైనది. ప్రభావిత ప్రాంతాలను గు ర్తించి బాలికలకు, వారి తల్లి దండ్రులకు అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు సమావేశాలు పెట్టి.. ట్రాఫికర్ల బారినపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. పోలీసు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలి. ట్రాఫికర్ ము ఠాలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉం ది. తాజాగా లలిత చూపిన సాహసం.. గిరిజనుల చైతన్యంతో ముఠా గుట్టురట్టయింది. కొత్తగా గ్రా మాలకు వస్తున్న వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.