బాహుబలిని చంపింది కట్టప్ప. ఇది కన్ఫామ్. ఫస్ట్ పార్ట్ లోనే డిసైడ్ అయిపోయింది. అయితే ఎందుకు చంపాడు అనేది మాత్రం ట్విస్ట్. ఈ సస్పెన్స్ కు తెర ...
బాహుబలిని చంపింది కట్టప్ప. ఇది కన్ఫామ్. ఫస్ట్ పార్ట్ లోనే డిసైడ్ అయిపోయింది. అయితే ఎందుకు చంపాడు అనేది మాత్రం ట్విస్ట్. ఈ సస్పెన్స్ కు తెర దించుతూ కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్.. కుమారుడు లీక్ చేశాడు. ఇటీవల చైన్నైలోని ఓ ఫంక్షన్ కు తండ్రీకొడుకులు వచ్చారు. బాహుబలి మూవీపై డిస్కషన్ జరుగుతుంది. బాహుబలిని మీరు ఎందుకు చంపారు అని అడిగారు.. దీనికి సత్యరాజ్ అలియాస్ కట్టప్ప చిన్న నవ్వు నవ్వి తప్పించుకున్నాడు. అయితే కొడుకు మాత్రం లీక్ చేసేశాడు. బాహుబలి లాంటి మూవీలో కట్టప్ప కొడుక్కే క్యారెక్టర్ ఇవ్వరా.. అందుకే మా డాడీ బాహుబలిని చంపేశాడు అంటూ సీరియస్ గా చెప్పాడంట. ఇలాంటి సమాధానం ఊహించని విలేకరులు మొదట షాక్ అయ్యారు.. ఆ తర్వాత నవ్వుకున్నారు.. కట్టప్ప ట్విస్ట్ ఇస్తే.. కొడుకు మాత్రం అంత కంటే పెద్ద చమత్కారే అంటూ రివర్స్ పంచ్ లు ఇచ్చారు. ఇంతకీ కట్టప్పను ఎందుకు చంపాడో మీ డాడీ చెప్పడా ఏంటీ.. మాకు కొంచెం చెప్పండి అంటే.. ససేమిరా అంటూ వెళ్లిపోయాడు కట్టప్ప కొడుకు.