ఇప్పటి వరకు మా కంపెనీ సిమ్ కొంటే టాక్ టైం ఫ్రీ, మెసేజ్ బ్యాలెన్స్ ఫ్రీ, డేటా ఫ్రీ అంటూ ప్రచారం చేసిన మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు కొత్త బాట...
ఇప్పటి వరకు మా కంపెనీ సిమ్ కొంటే టాక్ టైం ఫ్రీ, మెసేజ్ బ్యాలెన్స్ ఫ్రీ, డేటా ఫ్రీ అంటూ ప్రచారం చేసిన మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు కొత్త బాట ఎంచుకున్నాయి. మా కంపెనీకి చెందిన సిమ్ కొనుగోలు చేస్తే ఓ కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ అంటూ ఐడియా కంపెనీ వాళ్లు బ్యానర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. “ఐడియా సిమ్ కొంటే కిలో ఉల్లి ఫ్రీ” ఈ విధంగా ఈ రోజు హైదరాబాద్ బాద్ నగరంలోని దిల్ సఖ్నగర్ చౌరస్తాలో బ్యానర్లు వెలిశాయి.
