మీరు మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక నుండి చెట్లు ఎక్కడం ప్రారంభించండి. ఎందుకంటే చెట్లెక్కితే జ్ఞాపకశక్తి పెరుగుతుందట! అ...
మీరు మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక నుండి చెట్లు ఎక్కడం ప్రారంభించండి. ఎందుకంటే చెట్లెక్కితే జ్ఞాపకశక్తి పెరుగుతుందట! అందుకే గామోసు చెట్టులెక్కగలవా… ఓ నరహరి పుట్టలెక్కగలవా… అని పాట పాడుతూ ప్రియుడి తెలివితేటల్ని, సామర్ధ్యాన్ని ప్రియురాలు పరీక్షిస్తుంది ఓ పాటలో! చెట్లెక్కడం అనగానే అదేదో పిల్లల చేష్టలు అనుకునేరు! ఏ మాత్రం కాదు! పెద్దవయసు వాళ్ళు కూడా మెమరీ పవర్ పెంచుకోవాలనుకుంటే రోజూ చెట్లు ఎక్కుతూ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదని ఫ్లోరిడాలోని పరిశోధకులు వెల్లడించారు.
తెలివితేటల్ని పెంచుకోవాలంటే, క్రాస్ వర్డ్స్, సుడోకు పూర్తి చేయమని సాధారణంగా అంతా చెబుతారు. ఒకవేళ మీకు ఈ తతంగం బోర్ కొడితే చెట్లెక్కడం మొదలెట్టండి. తెలివితేటలు వాటంతట అవే పెరుగుతాయి! ప్రతి రోజు మనిషి తన దినచర్యకు సంబంధించి ఎన్నో విషయాలు మరిచిపోతూ ఉంటాడు. కానీ ఇలా చెట్లెక్కినవారిని పరిశీలించినప్పుడు వారిలో రోజువారీ జ్ఞాపకశక్తి యాభై శాతం మేరకు పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఫుట్‌బాల్, టెన్నిస్, స్క్వాష్ వంటి ఆటలు ఆడేవారిలో కూడా ఇదే స్థాయిలో రోజూవారీ పనులకు సంబంధించిన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నార్త్ ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు 72 మందిని ప్రత్యేకంగా రిక్రూట్ చేసి వారికి చెట్లెక్కే పని పురమాయించారు. వీరిలో 18 నుండి 59 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. చెట్లె క్కుతూ అంకెలను రివర్స్‌లో లెక్కబెట్టడం, చెట్టుమీద నుంచి పడిపోకుండా బేలన్స్ చేసుకోవడం ఏక కాలంలో చేయించారు. చెప్పులు లేకుండా పరుగులు పెట్టడం, ఒక సన్నటి కర్ర మీద బేలన్స్ చేసుకుంటూ నడిచి అవతలకి వెళ్ళడం ఇవన్నీ సక్సెస్‌ఫుల్‌గా ప్రాక్టీస్ చేసినవారిలో మెమరీ 50 శాతం వృద్ధికావడాన్ని పరిశోధకులు నమోదు చేశారు. చక్కటి హరిత వాతావరణంలో ఎత్తైన చెట్లు ఎక్కడం ప్రాక్టీస్ చేయడం వల్ల తమ వర్కింగ్ మెమరీ వృద్ధిచెందిందని ఈ పరిశోధనలో పాల్గొన్న రాస్-అలే దంపతులు వెల్లడించారు.