టీఎస్పీఎస్సీ సమావేశంలో నిర్ణయించే అవకాశం తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, రా...

టీఎస్పీఎస్సీ సమావేశంలో నిర్ణయించే అవకాశం
తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ వెలువడిన కొత్త పరీక్షా ప్రణాళికకు అనుగుణంగా సిలబస్ బుధవారం ఖరారయ్యే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సీ విఠల్, చంద్రావతి, మతీనొద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్‌లు బుధవారం సమావేశమై సిలబస్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 సహా ఇతర టెక్నికల్ పరీక్షల సిలబస్‌పై స్పష్టత రానున్నది.