TBGKS ( తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం ) పదవులన్నీ రద్దు చేసిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశం లో T...
TBGKS ( తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం ) పదవులన్నీ రద్దు చేసిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశం లో TBGKS గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. TBGKS యూనియన్ కొత్త అధ్యక్షుడు ఎవరు ఎవరా అని ఎదురు చూస్తున్న కార్మిక లోకానికి పెద్ద షాక్ ఇచ్చారు. యూనియన్ కి సంబంధించి అన్ని పదవులను రద్దు చేస్తూ ఆమె నిర్ణయం తీస్కున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని పదవులకు కొత్తవారిని నియమిస్తామని ఆమె యూనియన్ సభ్యులకు తెలిపారు..
