టీఎస్‌పీఎస్సీ తొలి నోటిఫికేషన్ TSPSC FIRST NOTIFICATION ( TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION )

హైదరాబాద్:రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తీపికబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్...

TSPSC



హైదరాబాద్:రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తీపికబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తొలి నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం కమిషన్ కార్యాలయంలో విడుదలచేశారు. ఐదుశాఖల్లో సివిల్ క్యాటగిరీల్లోని 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలను మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ మూడు వరకూ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.. అదే నెల 20న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్ష ముగిసిన ఐదు రోజుల్లోనే కీ విడుదల చేసేందుకు, సత్వరమే ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. తర్వాతి దశల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో మరిన్ని పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలకానుంది.


-కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
- 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
- సెప్టెంబర్ 3లోగా దరఖాస్తులు.. 20న పరీక్ష
- ఐదు రోజుల్లో కీ.. సత్వరమే ఫలితాలు
- ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో పరీక్ష
- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో కేంద్రాలు
- టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి
- వారంలో అసిస్టెంట్ ఇంజినీర్ల భర్తీకి నోటిఫికేషన్
- సెప్టెంబర్, అక్టోబర్‌లో మరిన్ని పోస్టులకు
- మొత్తం 3783 పోస్టుల భర్తీకి అనుమతి 
- నెలాఖరులోగా గ్రూప్స్ సిలబస్ విడుదల
- అక్టోబర్ చివరిలోగా గ్రూప్ - 2 ప్రకటన 
- నవంబర్ లేదా డిసెంబర్‌లో పరీక్ష


గ్రూప్స్ సిలబస్ ఈ నెలాఖరుకల్లా సిద్ధంకానుంది. విడుదల చేసిన తొలి నోటిఫికేషన్ ప్రకారం భర్తీచేయనున్న పోస్టులకు బీటెక్, బీఈ సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు అర్హులని ఘంటా చక్రపాణి తెలిపారు. కమిషన్ కార్యాలయంలో సభ్యులు సీ విఠల్, చంద్రావతి, మతీనొద్దీన్ ఖాద్రీ, కమిషన్ సెక్రటరీ పార్వతి సుబ్రమణ్యన్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దరఖాస్తు చేసుకునేందుకు రెండువారాల గడువు ఉందని ఆయన తెలిపారు. పరీక్షను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో నిర్వహించనున్నట్లు వివరించారు. మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 450 మార్కులకు పరీక్ష, 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయని వివరించారు. పరీక్ష ముగిసిన ఐదు రోజుల్లో కీ విడుదల చేసేందుకు, తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చేందుకు స న్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వారం లో మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తమకు 3783 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, అవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు.

వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానంలో ఇప్పటివరకు 2,62,000 మంది వివరాలను నమోదు చేసుకున్నట్లు చక్రపాణి వివరించారు. ఇందులో 10,000 మంది సివిల్ ఇంజినీర్లు ఉన్నారని తెలిపారు. సదరు అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను వ్యాలిడేట్ చేసుకొని మూడు దశల ప్రక్రియ పూర్తిచేస్తే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని వివరించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి (01.08.2015 నాటికి) అన్ని కేటగిరీల వారికి కనీసం 18 ఏండ్లు, గరిష్టం 44 ఏండ్లు. వయోపరిమితి సడలింపు ఉన్న ఆయా వర్గాలకు ఆ మేరకు మినహాయింపు వర్తిస్తుంది. స్కేల్ ఆఫ్ పే : 37,100-91450.


సెప్టెంబర్, అక్టోబర్‌లో మరిన్ని పోస్టులకు



సెప్టెంబర్ మొదటివారంలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కానున్నట్లు చక్రపాణి తెలిపారు. అగ్రికల్చర్,హార్టికల్చర్, ఎక్సైజ్, ఇతర శాఖల రిక్రూట్‌మెంట్లకు సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ప్రకటన విడుదల చేస్తామన్నారు. వీటితోపాటు మరిన్ని విభాగాలనుంచి రోస్టర్ పాయింట్లు, ఖాళీలు తదితర వివరాలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన తర్వాత భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని స్పష్టంచేశారు. గ్రూప్స్ మినహా మిగతా పరీక్షలకు చెందిన అన్ని ప్రక్రియలను డిసెంబరులోగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.


నెలాఖరులోగా గ్రూప్స్ సిలబస్



ఈ నెలాఖరులోగా గ్రూప్స్ సిలబస్ విడుదల చేయనున్నట్లు ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ సిలబస్‌ను కమిషన్ వెబ్‌సైట్ http://tspsc.gov.inలో పొందుపరుస్తామని చెప్పారు. కొత్త రాష్ట్రం, కొత్త సిలబస్ కాబట్టి సిలబస్‌కు అనుగుణంగా సన్నద్ధం అయ్యేందుకు అభ్యర్థులకు సరిపడా సమయం లభిస్తుందని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరిలోగా గ్రూప్-2 ప్రకటన వస్తుందని తెలిపారు. నవంబర్ లేదా డిసెంబర్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రూప్-1 క్యాటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయని, అందులోని 53 పోస్టులపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని వివరించారు. 

గ్రూప్-2లో 400 పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయని, కొంతకాలం ఆగితే ప్రభుత్వంనుంచి మరిన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతివచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై అక్టోబర్ చివరిలోగా రిపోర్టు ఇస్తుందని, తద్వారా మరిన్ని ఉద్యోగాల ఖాళీలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మార్చిలోగా గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చక్రపాణి తెలిపారు. గ్రూప్-2లో ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టంచేశారు. ఆ స్థాయి క్యాటగిరీలో ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్వ్యూ తప్పనిసరని అన్నారు. గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని రాతపరీక్ష విధానాన్ని కూడా పక్కపెట్టినట్లు వివరించారు. భారీస్థాయిలో అవకతవకలు జరిగిన వ్యాపం, ఆలిండియా మెడికల్ ప్రవేశ పరీక్షతోపాటు తాజాగా నకిలీలు పరీక్ష రాసిన రాష్ట్ర ఎడ్‌సెట్ వంటి ఘటనల రీత్యా బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నదని చైర్మన్ స్పష్టంచేశారు. ఈ వివరాలు ఒక్కసారి సేకరిస్తే.. ఉద్యోగం పొందిన వ్యక్తి తన సర్వీసుకాలంలో పదేపదే ఆ వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని చెప్పారు.

గత కమిషన్ల పనితీరు చూసి ప్రస్తుత కమిషన్‌కు దురుద్దేశాలు ఆపాదించవద్దని, తమ పనితీరు చూసిన తర్వాతే వ్యాఖ్యానించాలని చక్రపాణి కోరారు. పరీక్షల ప్రక్రియలన్నింటిలోనూ వివాదాలు లేకుండా చేయాలనేదే కమిషన్ అభిమతమని స్పష్టంచేసిన చక్రపాణి.. అడ్డుకోవాలనే ఆలోచన ఉన్నవారిని ఏం చేయగలమని అన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉన్నందున.. వాటికి ఆన్‌లైన్ పరీక్షా విధానం సాధ్యం కాదని చెప్పారు. తాజా నోటిఫికేషన్‌కు 58 ఏండ్ల వయోపరిమితిని కటాఫ్‌గా తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు వయోపరిమితి విషయంలో చట్టబద్ధ సంస్థ అయిన కమిషన్ విధివిధానాలు పొందుపర్చుకున్నామని చెప్పారు. కావున ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మైనార్టీ కోటా తప్పక ఉంటుందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలు సరికావన్నారు.


నేడు అప్‌లోడ్ కానున్న నోటిఫికేషన్



ఏఈఈ ఉద్యోగాల భర్తీకి విడుదలచేసిన నోటిఫికేషన్ గురువారం కమిషన్ వెబ్‌సైట్ 
http://tspsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: టీఎస్‌పీఎస్సీ తొలి నోటిఫికేషన్ TSPSC FIRST NOTIFICATION ( TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION )
టీఎస్‌పీఎస్సీ తొలి నోటిఫికేషన్ TSPSC FIRST NOTIFICATION ( TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION )
http://namasthetelangaana.com/updates/2015/august/20/TSPSC.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/08/tspsc-first-notification-telangana.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/08/tspsc-first-notification-telangana.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy